Rashid Khan : ఖాన్ కమాల్ క్యాచ్ అవార్డు విన్నర్
కళ్లు చెదిరే క్యాచ్ తో అవార్డు
Rashid Khan : ఐపీఎల్ ముగిసింది. అవార్డుల పంట పండింది. కోట్లు కుమ్మరించింది బీసీసీఐ. విజేతకు రూ. 20 కోట్లు ఇస్తే రన్నర్ అప్ కు రూ. 12.50 కోట్లు అందజేసింది. ఇక అత్యుత్తమ అవార్డులు విభాగాల వారీగా ప్రకటించింది. కప్ గెలవక పోయినా గుజరాత్ టైటాన్స్ కు మాత్రం ఈసారి పురస్కారాల పంట పండింది. ఆరెంజ్ క్యాప్ , పర్పుల్ క్యాప్ , అత్యంత విలువైన ఆటగాడి, ఎక్కువ ఫోర్లు కొట్టిన ఆటగాడిగా ఓపెనర్ శుభ్ మన్ గిల్ నిలిచాడు.
ఇక బౌలింగ్ పరంగా టాప్ లో షమీకి దక్కింది. ఇక అత్యుత్తమ క్యాచ్ అవార్డు సైతం గుజరాత్ ఆల్ రౌండర్, ఆఫ్గనిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్(Rashid Khan ) కు దక్కింది. ఐపీఎల్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో పరుగెత్తుకుంటూ వెళ్లి ఫోర్ పోకుండా ఆపాడు. కళ్లు చెదిరేలా బంతిని ఒడిసి పట్టుకున్నాడు. రషీద్ ఖాన్ తో పాటు సంజూ శాంసన్ ,ఇతర ఆటగాళ్లు సైతం క్యాచ్ ల పరంగా రేసులో నిలిచినా చివరకు ఐపీఎల్ అవార్డుల కమిటీ మాత్రం ఏకంగా రషీద్ ఖాన్ వైపు మొగ్గు చూపింది.
దీంతో ఆఫ్గనిస్తాన్ ప్లేయర్ కు వ్యక్తిగతంగా ప్రైజ్ మనీ కింద రూ.10 లక్షలు అందజేసింది. బౌలింగ్ పరంగా దుమ్ము రేపాడు. కీలకమైన వికెట్లు తీసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అంతే కాదు ఆఖరులో వచ్చి ఫినిషర్ గా మారిన సందర్భాలు లేక పోలేదు. ఏది ఏమైనా ఐపీఎల్ లో మరోసారి సత్తా చాటిన రషీద్ ఖాన్ ను ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.
Also Read : IPL 2023 Game Changer