Immerse Medals : గంగలో ‘పతకాలు’ నిమజ్జనం
మహిళా రెజ్లర్ల సంచలన నిర్ణయం
Immerse Medals : భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలని, ఆయనను తొలగించాలని డిమాండ్ చేస్తూ మహిళా రెజ్లర్లు చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. ఇప్పటికే శాంతియుతంగా నిర్వహిస్తున్న మార్చ్ పై ఢిల్లీ ఖాకీలు దాడులకు పాల్పడ్డారు. ఆపై అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇది దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా చేసింది. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం జరుగుతున్న వేళ ఖాకీల నిర్వాకం తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.
తాజాగా మహిళా రెజ్లర్లు మరో సంచలన ప్రకటన చేశారు. తాము సాధించిన పతకాల(Medals) వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని పేర్కొన్నారు. తమకు ఆత్మ గౌరవం ముఖ్యమని స్పష్టం చేశారు. ఆదుకోవాల్సిన, రక్షించాల్సిన కేంద్ర సర్కార్ ఎవరైతే వేధింపులకు పాల్పడుతున్నారో ఆయనకే సపోర్ట్ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. హరిద్వార్ లోని గంగలో పతకాలను నిమజ్జనం చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.
పతకాలు కోల్పోయిన తర్వాత తమ జీవితాలకు అర్థం ఉండదన్నారు. అయినప్పటికీ తమ ఆత్మను చంపుకునేందుకు తాము సిద్దంగా లేమని స్పష్టం చేశారు. ఇప్పటికే పతకాలను గంగలో కలిపేందుకు హరిద్వార్ కు చేరుకున్నారు. స్వయంగా ఒక మహిళ అయిన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కిమ్మనకుండా ఉండి పోయారు. చూస్తూ ఏమీ చేయలేక పోయారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేదని తేలి పోయిందన్నారు బాధిత మహిళలు.
Also Read : YS Jagan