Rakesh Tikait : రెజ్ల‌ర్ల‌పై ఉక్కుపాదం టికాయ‌త్ ఆగ్ర‌హం

డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ ను తొల‌గించాలి

Rakesh Tikait : సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నాయ‌కుడు రాకేశ్ టికాయ‌త్(Rakesh Tikait) నిప్పులు చెరిగారు. మ‌హిళా రెజ్ల‌ర్లు చేస్తున్న న్యాయ ప‌ర‌మైన పోరాటానికి తాము బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. దేశం కోసం త‌మ శ‌క్తియుక్తుల్ని ధార పోసి ప‌త‌కాలు సాధించి తీసుకు వ‌చ్చిన వారి ప‌ట్ల కేంద్రం అనుస‌రిస్తున్న విధానం దారుణంగా ఉంద‌ని ఆరోపించారు.

చివ‌ర‌కు ప‌త‌కాల‌ను గంగ‌లో నిమ‌జ్జ‌నం చేసేందుకు సిద్ద‌మ‌య్యారంటే సిగ్గుతో ప్ర‌ధాని మోదీ త‌ల దించు కోవాల‌ని మండి ప‌డ్డారు. ఎవ‌రి కోసం ఈ ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని ప్ర‌శ్నించారు.

మ‌హిళా రెజ్ల‌ర్లు ఈ దేశ పౌరులు కారా అని ప్ర‌శ్నించారు. తాము ఇక నుంచి ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌కు దిగుతామ‌ని ప్ర‌క‌టించారు. ఇది మ‌రో రైతు ఉద్య‌మం అవుతుంద‌ని హెచ్చ‌రించారు. మ‌హిళా రెజ్ల‌ర్ల‌పై లైంగిక‌, మాన‌సిక‌, శారీర‌కంగా వేధింపుల‌కు పాల్ప‌డిన భార‌త రెజ్ల‌ర్ల స‌మాఖ్య చీఫ్‌, భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాకేశ్ టికాయ‌త్ డిమాండ్ చేశారు.

లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చరించారు. గ‌త కొంత కాలంగా న్యాయం కోసం పోరాడుతున్న మ‌హిళా రెజ్ల‌ర్ల ప‌ట్ల ఢిల్లీ పోలీసులు అనుస‌రిస్తున్న తీరు గ‌ర్హ‌నీయ‌మ‌ని పేర్కొన్నారు.

Also Read : Wrestlers Deadline

Leave A Reply

Your Email Id will not be published!