United Wrestling Body : బ్రిజ్ పై ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య ఫైర్
45 రోజుల్లోగా ఎన్నికలు చేపట్టాలి
United Wrestling Body : భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన యూపీకి చెందిన వ్యక్తి. భారతీయ జనతా పార్టీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సం రోజున శాంతియుతంగా మార్చ్ చేపట్టిన మహిళా రెజ్లర్లపై ఢిల్లీ ఖాకీలు దారుణంగా ప్రవర్తించారు. ఆపై అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. తాజాగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య(United Wrestling Body) సీరియస్ గా స్పందించింది.
ప్రస్తుత భారత్ రెజ్లింగ్ సమాఖ్యకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి డెడ్ లైన్ విధించింది. ఇందుకు సంబంధించి 45 రోజుల టైమ్ ఇచ్చింది. రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించక పోతే అప్పుడు భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య. సమాఖ్య చేసిన హెచ్చరిక కలకలం రేపింది. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ ఫెడరేషన్ ను రద్దు చేస్తామని స్పష్టం చేసింది.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై మరోసారి విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. శాంతియుతంగా ఆందోళన చేపట్టిన మహిళలను అరెస్ట్ చేయడం దారుణమని పేర్కొంది. ఇది ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దమని మండిపడింది. బ్రిజ్ పై విచారణ చేపట్టిన నివేదిక పూర్తిగా అనుమానాలకు తావిస్తోందంటూ ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య. ఒకవేళ ఫెడరేషన్ రద్దయితే రెజ్లర్లు సంస్థ తరపు కాకుండావ్యక్తిగతంగా ఒలింపిక్స్ లో పాల్గొనాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Also Read : RS Praveen Kumar