MP Pritam Munde : మహిళ రెజ్లర్ల పోరాటం బాధాకరం
మహారాష్ట్ర ఎంపీ ప్రీతమ్ ముండే
MP Pritam Munde : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ బూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళా రెజ్లర్లు చేపట్టిన ఆందోళన బాధాకరమని అన్నారు మహారాష్ట్ర ఎంపీ ప్రీతమ్ ముండే(MP Pritam Munde). ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారనేది పక్కన పెడితే ముందు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పైవారిపై ఉందన్నారు. తాము సాధించిన పతకాలను గంగలో నిమజ్జనం చేస్తామనడం తనను కలిచి వేసిందన్నారు ప్రీతమ్ ముండే. మల్ల యోధుల నరిసనపై చర్యను తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఈ విషయంలో అధికార బీజేపీ మౌనం వహిస్తున్న సమయంలో ఎంపీ మౌనాన్ని వీడడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరైనా ఫిర్యాదు చేసినా వెంటనే విచారణ చేపట్టాలని ప్రీతమ్ ముండే డిమాండ్ చేశారు. తర్వాత ఫిర్యాదు సరైనదా కాదా అని నిర్ణయించ వచ్చని అన్నారు. మహారాష్ట్ర లోని బీడ్ జిల్లాలో ప్రీతమ్ ముండే మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత కేసులో చర్యలు తీసుకుంటారన్న నమ్మకం తనకు ఉందన్నారు.
నేను పార్లమెంట్ సభ్యునిగా కాదు ఒక మహిళగా అటువంటి ఫిర్యాదు ఏదైనా మహిళ నుండి వస్తే దాని గురించి తెలుసు కోవాలి, దానిని ధృవీకరించాలని స్పష్టం చేశారు. నేను ఈ ప్రభుత్వంలో భాగమైనప్పటికీ మల్ల యోధులతో ప్రభుత్వం సంభాషించాల్సిన విధంగా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Mohan Bhagwat