Karnataka Formula Comment : కాంగ్రెస్ లో కర్ణాటక ఫార్ములా
మారిన పార్టీ హైకమాండ్ ధోరణి
Karnataka Formula Comment : 138 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కర్ణాటక ఫార్ములా(Karnataka Formula) అందివచ్చిన అవకాశంగా మారింది. నిన్నటి దాకా భారతీయ జనతా పార్టీ మోదీ, షా, నడ్డా త్రయం కొట్టిన దెబ్బకు, అనుసరిస్తున్న వ్యూహాలకు ఒకింత కలవరానికి గురైంది. ఇదే సమయంలో సీనియర్లు సైతం పక్క చూపులు చూడడం, పార్టీలోనే ఉంటూ ధిక్కార స్వరం వినిపించడం , కొన్ని చోట్ల గెలిచినా పవర్ లోకి రాక పోవడం , తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) భారత్ జోడో యాత్ర చేపట్టారో ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ వచ్చింది. సంబండ వర్ణాలు, సకల జనులంతా రాహుల్ గాంధీకి జేజేలు పలికారు. ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చేపట్టిన పాదయాత్ర ఆనాటి స్వాతంత్ర సంగ్రామాన్ని తలపింప చేసింది. మొదట్లో బీజేపీ ఎద్దేవా చేసినా చివరకు మౌనంగా ఉండి పోయింది. విచిత్రం ఏమిటంటే అయోధ్య రామాలయానికి చెందిన ఆచార్యులలో కొందరు రాహుల్ గాంధీ యాత్రను ప్రశంసించడం.
మోదీ వైఫల్యాలను, పాలనా పరమైన తప్పిదాలను, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను, విదేశాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావిస్తూ నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ. ఆయన పార్లమెంట్ లో నిలదీశారు. మోదీని కడిగి పారేశారు. చివరకు ఆయనను లోక్ సభలో లేకుండా అనర్హత వేటుకు గురి చేసింది కేంద్ర సర్కార్. అయినా ఎక్కడా తగ్గ లేదు. అదర లేదు బెదర లేదు. వెనక్క తగ్గలేదు. తన ఫ్యామిలీ చేసిన త్యాగాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. తన నాయినమ్మను పొట్టన పెట్టుకున్నారు. తన తండ్రిని నామ రూపాలు లేకుండా హత్య చేశారు. కానీ ఏనాడూ పల్లెత్తు మాట అనలేదని స్పష్టం చేశాడు రాహుల్ గాంధీ. చివరకు తన తండ్రిని చంపిన వారిని సైతం క్షమించడం ఒక రకంగా ఆ పార్టీకి ప్లస్ పాయింట్ గా మారింది. ఆ తర్వాత గుజరాత్ , ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినా హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది.
ఇదే సమయంలో కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఊహించని రీతిలో కాషాయ సర్కార్ కు కోలుకోలేని ఝలక్ ఇచ్చింది. ఇక్కడ మోదీ అంతా తానై వ్యవహరించారు. అమిత్ షా వ్యూహాలు పన్నారు. కానీ వర్కవుట్ కాలేదు. 224 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు గెలుచుకుంది. మిగతా స్వతంత్ర అభ్యర్థులు సైతం కాంగ్రెస్ కే జై కొట్టారు. దీంతో బలం 139కి చేరుకుంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ గ్యారెంటీ పేరుతో మేని ఫెస్టో ప్రకటించింది. ఇది ఓట్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇదే సమయంలో విజయపు తీరాలను చేర్చిన కర్ణాటక ఫార్ములా(Karnataka Formula) (5 హామీలు)ను మిగతా రాష్ట్రాలలో అమలు చేయాలని చూస్తోంది హైకమాండ్. అమెరికా టూర్ లో ఉన్న రాహుల్ గాంధీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా ఉండ బోతున్నాయని. సర్వేలు సైతం జోడో యాత్ర తర్వాత రాహుల్ గ్రాఫ్ పెరిగిందని చెబుతున్నాయి. నిన్నటి దాకా పప్పు అన్న వాళ్లే ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తంగా ఫార్ములా పని చేస్తుందా అన్నది చూడాలి.
Also Read : Anurag Thakur