Ajinkya Rahane : గతం కంటే భవిష్యత్తు ముఖ్యం
భారత క్రికెటర్ అజింక్యా రహానే
Ajinkya Rahane : ఐపీఎల్ పుణ్యమా అని మరోసారి తన సత్తా చాటాడు అజింక్యా రహానే(Ajinkya Rahane). ఈసారి వేలం పాటలో ఎవరూ పట్టించు కోలేదు. కనీస ధరకు ఊహించని రీతిలో చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ దక్కించుకున్నాడు. ఇది అందరినీ విస్తు పోయేలా చేసింది. కానీ ఐపీఎల్ 16వ సీజన్ లో ఎవరూ అనుకోని రీతిలో తన సహజ సిద్దమైన ఆట తీరుకు భిన్నంగా ఆడాడు రహానే. ఆపై రెచ్చి పోయాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు.
ఒకానొక దశలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కూడా సాధించాడు. కళాత్మకమైన ఆట తీరును ఎక్కువగా ఇష్టపడే అజింక్యా రహానే మొత్తంగా తన స్టైల్ ను మార్చేశాడు. ఆపై ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. సీఎస్కే గెలుపులో కీలకమైన పాత్ర పోషించాడు. ఆపై అందరి దృష్టిని ఆకర్షించాడు రహానే. అంతే కాదు ఆ జట్టు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. దీంతో ఏకంగా ఆటకు దూరంగా ఉన్న రహానేను బీసీసీఐ ఏరి కోరి ఇంగ్లండ్ లో ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు ఎంపిక చేసింది.
ఈసందర్భంగా ఫుల్ ప్రాక్టీస్ లో నిమగ్నమై పోయాడు అజింక్యా రహానే. బీసీసీఐ టీవీతో ముచ్చటించాడు. తన అభిప్రాయాలను పంచుకున్నాడు. తాను గతం గురించి పట్టించుకోనని చెప్పాడు. తనకు భవిష్యత్తు ముఖ్యమని స్పష్టం చేశాడు. ఈసారి తన ఆట తీరు భిన్నంగా ఉండబోతోందని స్పష్టం చేశాడు రహానే.
Also Read : Mamata Banerjee