David Warner : క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న వార్నర్
2024లో ఇక ఆఖరు సీజన్ కావచ్చని ప్రకటన
David Warner : ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఆటగాడిగా పేరు పొందిన డేవిడ్ వార్నర్(David Warner) కీలక ప్రకటన చేశారు. ఈనెలలోనే ఇంగ్లండ్ లోని ఓవెల్ లో భారత జట్టుతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు క్రికెట్ ఛాంపియన్ షిప్ కు సంబంధించి ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ జూన్ 7 నుంచి మొదలవుతుంది. ఈ తరుణంలో కీలక ప్రకటన చేశాడు ఆసిస్ స్టార్ డేవిడ్ వార్నర్. తాను ఇక సెలవు తీసుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. ఎందుకంటే ప్రతి ఆటగాడికి ఏదో ఒక రోజు విరమణ తప్పదన్నాడు.
వచ్చే 2024లో పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సందర్భంగా తనకు ఇదే ఆఖరి మ్యాచ్ కానుందని స్పష్టం చేశాడు. విచిత్రం ఏమిటంటే డేవిడ్ వార్నర్ కు ఆస్ట్రేలియాలో కంటే ఇండియాతోనే అనుబంధం ఎక్కువ. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో భారతీయులతో అనుబంధం పెంచుకున్నాడు. అంతే కాదు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు. నాయకుడిగా ఉన్నాడు. ఆ జట్టుకు ఛాంపియన్ షిప్ అందించాడు. ఆ తర్వాత అనూహ్యంగా ఆ జట్టు నుంచి తొలగించబడ్డాడు.
అందరూ వద్దనుకున్న డేవిడ్ వార్నర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. ఈసారి జరిగిన ఐపీఎల్ సీజన్ లో దుమ్ము రేపాడు. వ్యక్తిగతంగా అద్భుతంగా రాణించినా కెప్టెన్ గా విఫలమయ్యాడు. ఏది ఏమైనా వార్నర్ ప్రకటన క్రికెట్ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించగా ఫ్యాన్స్ మాత్రం తీవ్ర బాధకు లోనయ్యారు.
Also Read : Greg Chappell Gill