Mukhthar Ansari : గ్యాంగ్ స్టర్ అన్సారీకి జీవిత ఖైదు
32 ఏళ్ల హత్య కేసులో కోర్టు తీర్పు
Mukhthar Ansari : గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీకి బిగ్ షాక్ తగిలింది. 32 ఏళ్ల హత్య కేసులో గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీకి(Mukhthar Ansari) జీవిత ఖైదు విధించింది కోర్టు. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ ను కోర్టు దోషిగా నిర్దారించింది. ఈ మేరకు జీవిత ఖైదు విధించింది. అంతే కాకుండా 1,00,000 జరిమానా విధించింది.
అన్సారీ 1991లో రాజకీయంగా ప్రాబల్యం పొందడం ప్రారంభించిన కాంగ్రెస్ నాయకుడిని హత్య చేసినట్లు అభియోగాలు మోపారు. ఆగస్టు 3న ఆనాడు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ సోదరుడు అవధేష్ రాయ్ వారణాసి లోని రాయ్ ఇంటి బయట కాల్చి చంప బడ్డాడు.
కాగా ముఖ్తార్ అన్సారీ నేరం చేసినప్పుడు ఎమ్మెల్యే కాదు. తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కోర్టు ప్రాంగణంలో భద్రతను మరింత కట్టుదిట్టం చస్త్రశారు. రాయ్ కేసు లో ముఖ్తార్ అన్సారీ, భీమ్ సింగ్ , మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ కలీమ్ , మరో ఇద్దరిని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
.
కాగా తనపై ఉన్న 61 క్రిమినల్ కేసుల్లో అన్సారీకి ఇది ఐదో శిక్ష. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అన్సారీపై మరో 20 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్తార్ అన్సారీకి ఈ ఏప్రిల్ లో మరో కిడ్నాప్ , హత్య కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.
Also Read : KTR : కాంతులీనుతున్న తెలంగాణ – కేటీఆర్