WTC Final 2023 : సమ ఉజ్జీల పోరుకు సన్నద్ధం
ఓవల్ లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్
WTC Final 2023 : అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. తటస్థ వేదికగా ప్రపంచ క్రికెట్ టెస్టు ఛాంపియన్ షిప్ కోసం రెండు జట్లు తలపడనున్నాయి. భారత్(India), ఆస్ట్రేలియా(Australia) జట్లు ఇంగ్లాండ్ లోని ఓవెల్ మైదానంలో పోరాడేందుకు సిద్దమయ్యాయి. ఇరు జట్లు అన్ని విభాగాలలో బలంగా ఉన్నాయి. ఇక భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. ఆసిస్ కు పాట్ కమిన్స్ నాయకుడిగా ఉన్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ సంచలన కామెంట్స్ చేశాడు. ఆసిస్ స్టార్ బౌలర్లను తట్టుకుని నిలబడడం చాలా కష్టమని ముందే హెచ్చరించాడు.
భారత్ పర్యటనలో ఆసిస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది భారత్. ఇక టీమిండియాలో ఆరితేరిన ఆటగాళ్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, అజింక్యా రహానే తో పాటు ముఖ్యమైన స్పిన్నర్లు, పేసర్లు కూడా ప్రభావం చూపనున్నారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఇప్పటికీ భారత్ కు అందని కలగానే మిగిలి పోయింది. మరి రోహిత్ సేన ఏం చేయబోతుందనేది వేచి చూడాలి. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతుండడం ఒకింత శుభ పరిణామం. పాట్ కమిన్స్, రోహిత్ శర్మ కలిసి ఫోటో సెషన్ కు ఫోజులు ఇచ్చారు. బుధవారం నుంచి టెస్టు ఛాంపియన్ షిప్ ప్రారంభం కానుంది. ఫైనల్ కు చేరుకునేందుకు ఎంతో కష్టపడ్డామని, ఇక కప్ కైవసం చేసుకోవడమే మిగిలి ఉందన్నారు ఇద్దరు కెప్టెన్లు.
Also Read : CM KCR : కుల..చేతి వృత్తిదారులకు ఖుష్ కబర్
