Wrestlers Demand : ఠాకూర్ ముందు ఐదు డిమాండ్లు
ముగిసిన మల్లయోధుల చర్చలు
Wrestlers Demand : తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన బాట పట్టిన మహిళా రెజ్లర్లు(Wrestlers) బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో బుధవారం ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తో పాటు మరికొందరు రెజ్లర్లు(Wrestlers) చర్చలు జరిపారు.
రెజ్లర్లు చర్చలకు రావాలని స్వయంగా మంత్రి ఆహ్వానించారు. అంతకు ముందు రెజ్లర్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో చర్చించారు. చట్టం అందరికీ ఒక్కటేనని స్పష్టం చేశారు. ఆయన సూచనల మేరకు క్రీడా మంత్రి మహిళా మల్ల యోధులతో చర్చలు జరిపారు.
గత ఐదు రోజుల వ్యవధిలో రెజ్లర్లు, కేంద్ర సర్కార్ మధ్య చర్చలు జరగడం ఇది రెండోసారి. వాళ్ల ప్రధాన డిమాండ్ మాత్రం భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్ గా ఉన్న యూపీకి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను తొలగించాలని. లైంగికంగా, మానసికంగా, శారీరకంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని వాపోయారు. ఈ మేరకు కోర్టుకు ఎక్కారు. ఆయనపై రెండు కేసులు కూడా నమోదయ్యాయి.
ఇక ఇవాళ కేంద్ర మంత్రితో భేటీ అయిన సందర్బంగా కూడా ఐదు ప్రధాన డిమాండ్ల ను ఉంచారు మహిళా రెజ్లర్లు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టు పట్టారు. దీనిపై ఇంకా కేంద్ర మంత్రి నుంచి క్లారిటీ రాలేదు. మరో వైపు రైతు నాయకులు కేంద్రానికి జూన్ 9 వరకు అల్టిమేటం ఇచ్చారు.
Also Read : Arvind Kejriwal : విద్యతోనే వికాసం విజయం – కేజ్రీవాల్