#Myanmar : మయన్మార్ లో ప్రజాస్వామ్యం మమ
Myanmar : మయన్మార్ అనగా బర్మా లో ఇన్నాళ్లూ పడుతూ లేస్తూ వస్తోన్న ప్రజాస్వామ్య పాలనకు మళ్ళీ మిలటరీ గ్రహణం పట్టింది.అయినా అక్కడి ప్రజాస్వామ్యాన్ని పాక్షిక ప్రజాస్వామ్యమే అనగలం.ఎందుకంటే
Myanmar : మయన్మార్ అనగా బర్మా లో ఇన్నాళ్లూ పడుతూ లేస్తూ వస్తోన్న ప్రజాస్వామ్య పాలనకు మళ్ళీ మిలటరీ గ్రహణం పట్టింది.అయినా అక్కడి ప్రజాస్వామ్యాన్ని పాక్షిక ప్రజాస్వామ్యమే అనగలం.ఎందుకంటే ఆమాత్రం ప్రజాస్వామ్య పాలన ఉందని భావించినప్పుడు కూడా మిలటరీ కి పాలనలో భాగస్వామ్యం ఉంటూ వచ్చింది.నేడు దాన్ని కూడా పూర్తిగా చేతిలోకి తీసుకోవడం ద్వారా మిలటరీ పాలన సంపూర్ణమైంది.
నవంబర్లో జరిగిన ఎన్నికల్లో అంగసాన్ సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసీ 80 శాతం ఓట్లతో సంపూర్ణ విజయం సాధించింది.మిలటరీ బలపర్చిన పార్టీ ప్రజామోదంలో దరిదాపులకు రాలేదు.కనీసం దానికి పాతిక శాతం సీట్లొచ్చినా అక్కడి రాజ్యాంగం ప్రకారం మిగతా పాతిక శాతం మిలటరీ రిజర్వేషన్ సీట్లను కలిపి అధికారంలోకి వచ్చేది.మరి ఆ అవకాశం లేకపోవడంతో తిరుగుబాటు చేసి అధ్యక్షుడిని,సూకీని అరెస్టు చేసి మిలటరీ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఒక కుంటిసాకుని ముందుకు తెచ్చింది.మయన్మార్ పాలనలో ఎప్పుడూ సైన్యానిదే పైచేయి.
ఒక పదేళ్లుగా ప్రహసనం గా సాగిన ప్రజాస్వామ్యం మళ్ళీ పూర్తిగా తెరచాటుకు పోవడం ప్రజాస్వామ్య ప్రియులకు చేదు వార్తే. ఆ దేశ వ్యవహారాల్లో ఎవరూ బయటనుండి వేలు పెట్టరాదంటూ అప్పుడే చైనా తన ఉద్దేశ్యాన్ని బయటపెట్టింది.ఆ దేశం పై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించకుండా ముందరి కాళ్లకు బంధమెయ్యడమన్న మాట.కరోనా,ప్రపంచ ఆర్ధిక మందగమనం నేపథ్యంలో అక్కడి పాలన త్వరగా కుదుటపడాలని ఆశిద్దాం.
– డా. డి.వి.జి.శంకర రావు , మాజీ ఎంపీ, పార్వతీపురం. 94408 36931.
No comment allowed please