Ilayaraja Bharatiraja : కంగ్రాట్స్ భారతీ రాజా – ఇళయరాజా
అరుదైన దృశ్యం ఆవిష్కృతం
Ilayaraja Bharatiraja : ఇద్దరూ ఇద్దరే. తమిళ సినిమా చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానం కలిగిన వాళ్లు. ఒకరు జగమెరిగిన సంగీత దర్శకుడు ఇళయరాజా అయితే మరొకరు అద్బుతమైన సినిమాలను తీసి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న డైరెక్టర్ భారతీ రాజా. ఎక్కడో హార్మోనియం వాయించుకుంటూ ఉన్న ఇళయరాజాను గుర్తించి అతడిని దివంగత మహా గాయకుడు పండితారాధ్యుల బాల సుబ్రమణ్యంకు పరిచయం చేసిన ఏకైక వ్యక్తి భారతీ రాజా. ఆయన టీంలో సభ్యుడిగా ఉన్న ఇళయరాజా ఆ తర్వాత చరిత్ర సృష్టించారు. ప్రపంచం విస్తు పోయేలా సంగీతం అందించారు. వేల పాటలు ఇప్పటికీ మనల్ని కట్టి పడేస్తున్నాయి.
ఇక భారతీ రాజా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తీసిన ప్రతి సినిమా ఓ కళా ఖండం. అటు తమిళంలో ఇటు తెలుగులో ఎంతో కాలం ఆడాయి. గొప్ప పేరు తీసుకు వచ్చేలా చేశాయి. ఇక చెన్నైలో ఇళయరాజా(Ilayaraja), భారతీ రాజా ఏ మాత్రం వీలు చిక్కినా కలుసుకుంటారు. తమ అభిప్రాయాలను , ఆలోచనలను పంచుకుంటారు. ఆపై సినిమాల గురించి చర్చించుకుటారు.
ఇటీవలే కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం ఇళయరాజాను గుర్తించింది. సముచిత గౌరవాన్ని కల్పించింది. ఆయనకు రాజ్యసభ ఎంపీగా ప్రమోట్ చేసింది. ఇది యావత్ సంగీత ప్రపంచానికి దక్కిన గుర్తింపుగా భావించాలి. మొత్తంగా ఇవాళ భారతీ రాజాను కలిసి ప్రత్యేకంగా ఇళయరాజా అభినందించడం విశేషం. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read : DK Shivakumar : మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది – డీకే