Scoop Web Series : స్కూప్ వెబ్ సీరీస్ సూప‌ర్

నెట్ ఫ్లిక్స్ లో సెన్సేష‌న్

Scoop Web Series : కొన్ని క‌థ‌ల కంటే సంఘ‌ట‌న‌లే ఎక్కువ‌గా ఆక‌ర్షించేలా చేస్తాయి. ఓ వైపు వినోద రంగంలో ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా పోటీ పెరిగింది. అంత‌ర్జాతీయ మార్కెట్ లో కాసులు కురిపిస్తుండ‌డంతో దేశాన్ని ప్ర‌భావితం చేస్తూ వ‌చ్చిన కొన్నింటిని ఆధారంగా చేసుకుని వెబ్ సీరీస్ లు, సినిమాలు వ‌స్తున్నాయి. ఆ మ‌ధ్య దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తీసిన కంపెనీ , శిష్యుడు తీసిన డి మూవీ స‌క్సెస్ మూట‌గట్టుకున్నాయి.

ఇక వెబ్ సీరీస్ ల‌లో ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది మాత్రం నెట్ ఫ్లిక్స్ లో జూన్ 2న విడుద‌లైన స్కూప్ వెబ్ సీరీస్(Scoop Web Series). క్రైమ్, డ్రామా దీని ప్ర‌ధాన ఉద్దేశం. హ‌న్స‌ల్ మెహ‌తా, మృణ్మ‌యీ లాగూ వైకుల్ దీనికి అంకురార్ప‌ణ చేస్తే హ‌న్స‌ల్ మెహ‌తా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అద్భుతంగా బుల్లి తెర మీద ఆవిష్క‌రించాడు. దీనికి నిర్మాతలుగా సంజ‌య్ రౌత్రాయ్, స‌రితా పాటిల్ వ్య‌వ‌హ‌రించారు.

ద‌ర్శ‌కుడి ప్ర‌తిభా నైపుణ్యం ఈ సీరీస్ లో బాగుంది. ఇప్ప‌టికే త‌న న‌ట‌న‌తో మెప్పించిన క‌రిష్మా త‌న్నా మంచి మార్కులు కొట్టేసింది. ఆమెతో పాటు మ‌హ్మ‌ద్ జీష‌న్ అయ్యూబ్ , హ‌ర్మ‌న్ బ‌వేజా, దేవెన్ భోజ‌ని, త‌న్నిష్ట ఛ‌ట‌ర్జీ , తేజ‌స్విని కొల్హా పురే, శిఖా త‌ల్సానియా, త‌న్మ‌య్ ధ‌నానియా, ప్రొసెన్ జిత్ ఛ‌ట‌ర్జీ, ఇనాయ‌త్ సూద్ , స్వ‌రూపా ఘోష్ , థాక‌ర్ , ఇర‌యా త‌ల్ బే ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

జిగ్నా వోర ఆరాసిన బిహైండ్ బార్స్ ఇన్ బైకుల్లా – మై డేస్ ఇన్ ప్రిజ‌న్ అనే పుస్త‌కం నుండి ప్రేర‌ణ పొందిందే ఈ స్కూప్ . క్రైమ్ జ‌ర్న‌లిస్ట్ జాగృతి పాఠక్ (క‌రిష్మా త‌న్నా) ప్ర‌యాణాన్ని వివ‌రించే క్యారెక్ట‌ర్ డ్రామా. తోటి జ‌ర్న‌లిస్ట్ హ‌త్య‌కు గురి కావ‌డం, ఆమెపై అభియోగాలు మోప‌డం , త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే దానిపై ఉత్కంఠ రేపేలా తీశాడు డైరెక్ట‌ర్.

Also Read : Ilayaraja Bharatiraja : కంగ్రాట్స్ భార‌తీ రాజా – ఇళ‌య‌రాజా

 

 

Leave A Reply

Your Email Id will not be published!