Ormax Popular Stars : మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్
నెంబర్ వన్ పొజిషన్ లో ప్రభాస్
Ormax Popular Stars : ప్రముఖ సంస్థ ఓర్మాక్స్(Ormax) మీడియా గురువారం కీలక ప్రకటన చేసింది. టాలీవుడ్ కు సంబంధించి మొత్తం 10 మంది అత్యంత జనాదరణ కలిగిన తెలుగు హీరోల జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ గా మారింది. విచిత్రం ఏమిటంటే సాహో, రాధే శ్యామ్ ఆశించిన మేర ఆడక పోయినప్పటికీ డార్లింగ్ ప్రభాస్ అందరినీ దాటేసి ముందు వరుసలో ఉండడం విశేషం. ఆయన నటించిన ఆదిపురుష్ విడుదల కానుంది. భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి.
ప్రభాస్ , అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్ వంటి దక్షిణాది నటుల పాపులారిటీ మరింతగా పెరగడం ఇందుకు నిదర్శనం . ఇక జాబితా పరంగా చూస్తే తొలి స్థానంలో ప్రభాస్ దక్కించు కోగా రెండో ప్లేస్ లో ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ నిలిచాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మూడో స్థానంతో సరి పెట్టుకున్నాడు. ఇక పుష్ప మూవీతో టాప్ లో కొనసాగుతూ వచ్చిన అల్లు అర్జున్ నాలుగో ప్లేస్ లో నిలిచాడు. ఇక ప్రిన్స్ మహేష్ బాబు సర్కారు వారి పాటతో దుమ్ము రేపినా ఎందుకనో ప్రభాస్ ను దాటలేక పోయాడు.
ఆయన ఐదవ స్థానానికే పరిమితమయ్యాడు. 6వ ప్లేస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండగా 7వ స్థానంలో అనూహ్యంగా నాని, 8వ స్థానంలో చిరంజీవి, 9వ స్థానంలో రవితేజ, 10వ స్థానంలో నితిన్ రెడ్డి ఉన్నారు. మొత్తంగా విచిత్రం ఏమిటంటే యువ ఆటగాళ్లతో పోటీ పడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన 8వ స్థానంలో ఉండడం విశేషం.
Also Read : Ghulam Nabi Azad : ప్రతిపక్షాల ఐక్యత వల్ల లాభం లేదు