Udhay Nidhi Stalin : మారి సెల్వరాజ్ కు ఉదయనిధి గిఫ్ట్
సూపర్ కార్ ను ప్రజెంట్ చేసిన నటుడు
Udhay Nidhi Stalin : తమిళ సినీ రంగంలో మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందారు మారి సెల్వరాజ్. ఆయన దర్శకత్వంలో వచ్చిన మామన్నన్ చిత్రం విడుదలైంది. భారీ ఎత్తున ఆదరణ చూరగొంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భిన్నమైన అంశాలను ప్రాతిపదికగా తీసుకుని సినిమాలను తెరకెక్కించడం మారి సెల్వరాజ్ కు ఇష్టం. సినిమానే వ్యాపకం ..చిత్రాలే జీవితంగా బతుకుతున్నాడు. ప్రతి ఫ్రేమ్ ను ఆకట్టుకునేలా చేయడంలో కీలకంగా వ్యవహరించాడు దర్శకుడు. ఈ క్రెడిట్ అంతా తనకే దక్కుతుందని ప్రశంసలతో ముంచెత్తారు సినీ విమర్శకులు. చూసిన ప్రతి ఒక్కరు బాగుందంటూ పేర్కొన్నారు.
ఈ చిత్రం ప్రస్తుత రాజకీయ నేపథ్యం, ప్రస్తుత సంఘటలను ప్రస్తావిస్తూ మామన్నన్ తీశాడు. ఈ చిత్రం గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చర్చిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తమిళులు ఈ మూవీని ఆదరిస్తున్నారు. చర్చకు దారి తీసేలా చేశాడు మారి సెల్వరాజ్. అంబేద్కర్, పెరియార్, అన్నాదురై, కలైనార్ కరుణానిధి వంటి నాయకుల స్పూర్తిని నేటి తరానికి ఆత్మ గౌరవపు భావాన్ని , సామాజిక న్యాయ ఆలోచనలను పెంపొందించారు.
కమర్షియల్ గా కూడా భారీ విజయాన్ని సాధించడం విశేషం. ఇదిలా ఉండగా చిత్రంలో నటించడమే కాకుండా నిర్మించిన తమిళనాడు మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్(Udhay Nidhi Stalin) సర్ ప్రైజ్ ఇచ్చారు. మినీ కూపర్ కారును దర్శకుడు మారి సెల్వరాజ్ కు అందజేశారు.
Also Read : Atchannaidu : అప్పలరాజుపై అచ్చెన్న ఆగ్రహం