Raghunandan Rao : పదవి కంటే ఆత్మ గౌరవం ముఖ్యం
ఎమ్మెల్యే రఘునందన్ రావు
Raghunandan Rao : భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. గత కొంత కాలంగా కాషాయ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోందన్న ప్రచారం చోటు చేసుకుంది. ఇదే సమయంలో సీనియర్ల మధ్య లుక లుకలు మొదలయ్యాయని హైకమాండ్ గమనించింది. ఈ మేరకు పార్టీ పెద్దలు దిద్దుబాటుకు దిగారు. ఆ వెంటనే మౌనంగా , దూరంగా ఉన్న ఈటల రాజేందర్ , కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డిలను హస్తినకు పిలిపించారు. చివరకు పార్టీ మార్పు ఉంటుందని స్పష్టం చేసినట్లు , ఈటలకు హామీ ఇచ్చినట్లు టాక్.
ఇదిలా ఉండగా బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన ప్రముఖ న్యాయవాది, ఎమ్మెల్యే రఘు నందన్ రావు(Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. తనకు పదవి కంటే ఆత్మ గౌరవం ముఖ్యమని స్పష్టం చేశారు. తనను గౌరవించని చోట తాను ఉండలేనంటూ పేర్కొన్నారు. నాకు నచ్చినన్ని రోజులు మాత్రమే పని చేస్తానని చెప్పారు. ఒకవేళ తనకు నచ్చక పోతే తాను ఉండలేనంటూ స్పష్టం చేశారు. నన్ను ఎవరూ బలవంతం చేయలేరని కుండ బద్దలు కొట్టారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే రఘు నందన్ రావు చేసిన ఈ కామెంట్స్ కాషాయ పార్టీలో కలకలం రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యాఖ్యలు ఆయన చేస్తారేమోనని పార్టీ శ్రేణులు వేచి చూస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ హవాను తట్టుకుని రఘునందన్ రావు నిలబడ్డారు. దుబ్బాకలో గెలుపు జెండా ఎగుర వేశారు.
Also Read : Bandi Sanjay : బండి భావోద్వేగం