Bandi Sanjay : బండి భావోద్వేగం

మోడీ స‌భ‌కు వ‌స్తానో రానో

Bandi Sanjay : నిన్న‌టి దాకా పుల్ జోష్ లో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ , క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ఉన్న‌ట్టుండి డీలా ప‌డ్డారు. ఆయ‌న షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈనెల 8న వ‌రంగ‌ల్ న‌గ‌రంలో నిర్వ‌హించే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స‌భ‌కు తాను వ‌స్తానో రానో తెలియ‌ద‌ని వాపోయారు. ఈ సంద‌ర్బంగా బండి సంజ‌య్ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. ఆపై కంట త‌డి పెట్టారు. దీంతో ఒక్క‌సారిగా కార్య‌క‌ర్త‌లు విస్తు పోయారు. మీరు ఉన్నంత వ‌ర‌కు పార్టీకి మీరే దిక్కు అంటూ పేర్కొన్నారు. మీరు లేక పోతే పార్టీ లేదంటూ వాపోయారు బీజేపీ శ్రేణులు.

రాష్ట్రంలో బీజేపీ ఈ స్థాయిలో ఉందంటే కార‌ణం మీరేనంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ త‌రుణంలో క‌ళ్ల‌ల్లో క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం ప్ర‌తి ఒక్క‌రినీ క‌లిచి వేసింది. ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యంగా కాషాయానికి పుల్ జోష్ తీసుకు వ‌చ్చేలా చేసిన ఘ‌న‌త మాత్రం ఈ క‌రీంన‌గ‌ర్ ఎంపీదని చెప్ప‌క త‌ప్ప‌దు. రాష్ట్రంలో ఆక్టోప‌స్ లా పాతుకు పోయిన భార‌త రాష్ట్ర స‌మితిని, ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ను, క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని ఏకి పారేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు.

ఒకానొక ద‌శ‌లో బీజేపీకి రాష్ట్రంలో పుల్ బూస్ట్ తీసుకు వ‌చ్చేలా చేశారు బండి సంజ‌య్ కుమార్(Bandi Sanjay). ఎప్పుడైతే ఈట‌ల రాజేంద‌ర్ ఎంట్రీ ఇచ్చారో సీనియ‌ర్ నేత‌లంతా ఒకే వైపు నిల‌బ‌డ‌డం, తీవ్ర ఆధిప‌త్య పోరు కొన‌సాగ‌డం , పార్టీ చీఫ్ మార్చుతార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రిగింది. ఈ త‌రుణంలో బండి కంట త‌డి పెట్ట‌డం దానికి మ‌రింత ఊతం ఇచ్చేలా చేసింది.

Also Read : Congress Success : స‌భ స‌క్సెస్ కాంగ్రెస్ లో జోష్

Leave A Reply

Your Email Id will not be published!