Congress Pension : కాంగ్రెస్ పెన్షన్ పార్టీల్లో టెన్షన్
ఫుల్ జోష్ లో నేతలు, కార్యకర్తలు
Congress Pension : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోష్ పెంచింది. ఇప్పుడు గాలి వీస్తోంది తమదేనంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ఖమ్మం జిల్లా వేదికగా ఆ పార్టీ ఆధ్వర్యంలో జన గర్జన సభ చేపట్టింది. ఈ సభకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. ఇది మరింత పార్టీలో జోష్ తెచ్చింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేయడం ఆసక్తిని రేపింది. తాము అధికారంలోకి వస్తే రూ. 4,000 వేల పెన్షన్ చొప్పున ఇస్తామని వెల్లడించారు రాహుల్ గాంధీ.
ఆయన చేసిన ఈ ఒక్క ప్రకటన లక్షలాది మంది బాధితుల్లో ఆనందం నింపింది. ఈ పెన్షన్ సౌకర్యం వృద్దులు, వితంతువులు, కార్మికులు, కూలీలు, ఎయిడ్స్ బాధితులు, వికలాంగులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా, డయాలసిస్ పేషంట్స్ , కల్లు గీత కార్మికులకు ఈ పెన్షన్ సౌకర్యం వర్తింప చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ ఒక కల అని, దానిని సాకారం చేసిన ఘనత కాంగ్రెస్(Congress) పార్టీదనంటూ పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల మనో భావాలు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ పార్టీ నడుచుకుంటుందని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ఈ తరుణంలో రాహుల్ రాక తో ఖమ్మంలో సభ మరింత జోష్ పెంచేలా చేసింది. 3 లక్షల మందికి పైగా జనం హాజరైనట్లు కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత చేసిన ప్రకటన కలకలం రేపింది. ఆయా పార్టీల్లో గుబులు రేపుతోంది. ఏది ఏమైనా జన గర్జన సభ కార్యకర్తలు, నేతలకు సంతోషాన్ని ఇచ్చేలా చేసింది.
Also Read : Annapurna Photo Studio : అన్నపూర్ణ ఫోటో స్టూడియోపై ఆసక్తి