CM YS Jagan : 108 అంబులెన్స్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం

కొనియాడిన ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

CM YS Jagan : రాష్ట్రంలో 108 అంబులెన్స్ లు అందిస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని పేర్కొన్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. సోమ‌వారం విజ‌య‌వాడ బెంజ్ స‌ర్కిల్ జంక్ష‌న్ వ‌ద్ద 108 అంబులెన్స్ ల‌ను ప్రారంభించారు. కొన్ని వాహ‌నాలు మ‌ర‌మ్మ‌తుకు రావ‌డంతో ఇబ్బంది ఏర్ప‌డింద‌ని గుర్తించారు సీఎం. ఈ మేర‌కు 34 కోట్ల రూపాయ‌ల‌కు పైగా పాత వాటి స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేసింది ప్ర‌భుత్వం. జెండా ఊపి అంబులెన్స్ వాహ‌నాల‌ను ప్రారంభించి ప్ర‌సంగించారు జ‌గ‌న్ రెడ్డి.

దేశంలోనే మొద‌టి సారిగా 108 వాహ‌నాల‌ను ప్ర‌వేశ పెట్టిన ఘ‌న‌త త‌న తండ్రి దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి ద‌క్కుతుంద‌న్నారు. కుయ్ కుయ్ అంటూ హార‌న్ కొట్టుకుంటూ వ‌చ్చే ఈ వాహ‌నాలు చేస్తున్న సేవ‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు ఏపీ సీఎం(CM YS Jagan).

అనేక సౌక‌ర్యాలు క‌లిగిన మొబైల్ మెడిక‌ల్ మెడిక‌ల్ యూనిట్లను కూడా సీఎం ప్రారంభించారు. ఎంఎంయూ సిబ్బంది గ్రామీణ ప్రాంతాలలో ప‌ర్య‌టించి సేవ‌లు అంద‌జేస్తార‌ని చెప్పారు జ‌గ‌న్ రెడ్డి. త‌మ ప్ర‌భుత్వం విద్య‌, వైద్య రంగానికి అత్య‌ధికంగా ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్లు తెలిపారు. కోట్లాది రూపాయ‌లు మంజూరు చేశామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

Also Read : Congress Pension : కాంగ్రెస్ పెన్ష‌న్ పార్టీల్లో టెన్ష‌న్

 

Leave A Reply

Your Email Id will not be published!