Manoj Muntashir Sorry : ఆది పురుష్ రచయిత క్షమాపణ
తప్పులు దొర్లాయి మన్నించండి
Manoj Muntashir Sorry : ఓం రౌత్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ , అందాల ముద్దుగుమ్మ కృతీ సనన్ కలిసి నటించిన ఆది పురుష్ మూవీ విడుదలైనా ఇంకా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. అలహాబాద్ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భారతీయ హితిహాసాలను ఇలా చులకన చేస్తూ తీస్తారా అంటూ సినీ నిర్మాతలు, దర్శకుడిని కోర్టు ముందుకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది ధర్మాసనం. ఇదే సమయంలో డైలాగులు రాసిన మనోజ్ ముంతాషీర్(Manoj Muntashir) పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
వివాదాలకు కేరాఫ్ గా మారిన ఆది పురుష్ మూవీ చిత్రానికి తాను రాసిన మాటలలో కొన్ని తప్పులు దొర్లాయని , వాటిని తాను కావాలని రాయలేదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. విమర్శకుల నుండి సమీక్షకుల దాకా ప్రతి ఒక్కరు తీవ్ర అభ్యంతరం తెలిపారు. కొన్ని డైలాగులపై నిరాశ తెలిపారు. మరేగా బేటే, బువా కా బాగీచా హై క్యా, జాలే తేరే బాప్ కీ వంటి మాటల్ని ఖండించారు.
ఇందుకు సంబంధించి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నాడు. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఆది పురుష్ వల్ల ప్రజల భావోద్వేగాలు భారీగా దెబ్బతిన్నాయని, ఇందుకు తనను మన్నించాల్సిందిగా కోరాడు మనోజ్ ముంతాషిర్.
ఇదిలా ఉండగా రిలీజైన ఆది పురుష్ ఆశించిన మేర ఆకట్టుకోలేక పోయింది. ఒక రకంగా ప్రభాస్ కెరీర్ లో సక్సెస్ కాని చిత్రంగా మిగిలిపోయింది. ప్రస్తుతం తను నటిస్తున్న సలార్ పై ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు.
Also Read : PM Modi Visit : భద్రకాళి గుడిలో మోదీ పూజలు
