India T20 Squad : భారత జట్టు విండీస్ లో పర్యటించనుంది. ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్న చేతన్ శర్మ స్థానంలో భారత క్రికెట్ జట్టు మాజీ స్టార్ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ వచ్చాడు. ఏమైనా జట్టు ఎంపిక లో కీలక మార్పులు ఉంటాయని ఆశించారు. కానీ ఎలాంటి మార్పులు లేక పోగా ఎప్పటి లాగే ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) లో పాలు పంచుకున్న ఆటగాళ్లను ఎంపిక చేసింది కొత్తగా కొలువు తీరిన ఎంపిక కమిటీ.
ముంబైకి చెందిన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు టీ20 జట్టు పగ్గాలు అప్పగించాడు. అంతా అనుకున్నట్టే సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ , విఆరట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చాచరు. 2022 నుండి కొనసాగుతూ వస్తున్న మరో ఇద్దరికి ఉద్వాసన పలికారు అజిత్ అగార్కర్. 2024లో జరిగే టీ20 వరల్డ్ కప్ కు పాండ్యా కెప్టెన్ గా ఉంటాడని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక కొత్తగా టీ20 జట్టు పరంగా చూస్తే హార్దిక్ పాండ్యా కెప్టెన్. ఇషాన్ కిషన్ , సంజూ శాంసన్ (వికెట్ కీపర్లు ) , శుభ్ మన్ గిల్ , యశస్వి జైస్వాల్ , తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్ ), అక్షర్ పటేల్ , యుజ్వేంద్ర చాహల్ , కుల్దీప్ యాదవ్ , రవి బిష్ణోయ్ , అర్ష్ దీప్ సింగ్ , ఉమ్రాన్ మాలిక్ , అవేష్ ఖాన్ , ముఖేష్ కుమార్ ఆడతారు. భారత జట్టు జూలై 12 నుంచి ఆడనుంది విండీస్ లో.
Also Read : US Chemical Weapons : రసాయన ఆయుధ నిల్వలు ధ్వంసం
