Rinku Singh Drop : రింకూ సింగ్ లేక పోతే ఎలా
అజిత్ అగార్కర్ పై ఫ్యాన్స్ ఫైర్
Rinku Singh Drop : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన భారత మాజీ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ కొలువు తీరాక వెస్టిండీస్ లో పర్యటించే భారత క్రికెట్ జట్టు టీ20ని ప్రకటించారు. చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ లో రాణించిన వారే. కానీ ఈసారి ఐపీఎల్ 2023లో అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించాడు రింకూ సింగ్.
ఈ యూపీకి చెందిన కుర్రాడి దెబ్బకు ప్రత్యర్థి జట్లు షాక్ కు గురయ్యాయి. ఆఖరులో వచ్చి మ్యాచ్ ల స్వరూపాన్నే పూర్తిగా మార్చేశాడు రింకూ సింగ్(Rinku Singh). అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ యువ ఆటగాడి ఆట తీరుకు క్రికెట్ లోకం విస్తు పోయింది. విండీస్ టూర్ లో భాగంగా ఎంపిక చేసిన భారత జట్టులో రింకూ సింగ్ ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదంటూ క్రికెట్ విమర్శకులు, విశ్లేషకులు, ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముంబైకి చెందిన ఇషాన్ కిషన్ కంటే రింకూ సింగ్ కు ఏం తక్కువ అంటూ నిప్పులు చెరిగారు. జట్టుకు ఎంపిక చేసి ఉంటే రింకూ సింగ్ మ్యాచ్ విన్నర్ గా మారే ఛాన్స్ ఉండేదన్నారు. ఇదిలా ఉండగా జట్టులో కొందరిని కావాలని కంటిన్యూ చేస్తున్నారంటూ వాపోతున్నారు. మొత్తంగా అగార్కర్ వచ్చినా జట్టులో మార్పులు ఏమీ ఉండవని అంటున్నారు.
Also Read : India T20 Squad : టీమిండియా టీ20 స్క్వాడ్
