Ajit Agarkar : సీనియ‌ర్ల‌కు మూడిన‌ట్లేనా

అంద‌రి ఫోక‌స్ అగార్క‌ర్ పైనే

Ajit Agarkar : బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ గా ఎన్నికైన భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ఆల్ రౌండ‌ర్ అజిత్ అగార్క‌ర్ వ‌చ్చీ రావ‌డంతోనే వెస్టిండీస్ లో ఈనెల 12 నుంచి ప‌ర్య‌టించే భార‌త జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాడు. వ‌న్డే, టీ20 టీమ్ ల‌ను వెల్ల‌డించాడు. మ‌రో వైపు సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ తో పాటు కేఎల్ రాహుల్ ల భ‌విత‌వ్యంపై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ గా ఉన్న చేత‌న్ శ‌ర్మ జాతీయ మీడియా జ‌రిపిన స్టింగ్ ఆప‌రేష‌న్ లో దొరికి పోయాడు. దీంతో కొత్త‌గా అగార్క‌ర్ కు అప్ప‌గించింది ఎంపిక చేసే బాధ్య‌త‌ల్ని.

కాగా మాజీ క్రికెట‌ర్ ఆకాష్ చోప్రా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. అగార్క‌ర్(Ajit Agarkar) అనుకున్నంత అమాయ‌కుడు కాడ‌ని పేర్కొన్నాడు. క‌చ్చితంగా క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటాడ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ రాబోయే విండీస్ తో జ‌రిగే టెస్టులు, వ‌న్డేల్లో ఆడ‌నున్నారు. ఇక కేఎల్ రాహుల్ గాయ‌ప‌డంతో బెంగ‌ళూరు లోని క్రికెట్ అకాడ‌మీలో శిక్ష‌ణ పొందుతున్నారు.

ఇప్ప‌టికే ఐపీఎల్ , దేశీవాళి టోర్నీల‌లో యువ ఆటగాళ్లు దుమ్ము రేపుతున్నారు. ఈ త‌రుణంలో సీనియ‌ర్ ఆట‌గాళ్లు గ‌నుక ప్ర‌తిభ చూపించ‌క పోతే ఇక ఆతీయ జ‌ట్టుకు ఎంపిక కావ‌డం క‌ష్ట‌మేనంటున్నారు చోప్రా. ఏది ఏమైనా అగార్క‌ర్ అసాధ్యుడా లేక జే షా చెప్పిన‌ట్లే న‌డుచుకుంటాడా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : Raghav Chadha : కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందింది

 

Leave A Reply

Your Email Id will not be published!