Kuchukulla Damodar Reddy : బీఆర్ఎస్ కు కూచుకుళ్ల ఝలక్
సీఎం కేసీఆర్ కు కోలుకోలేని షాక్
Kuchukulla Damodar Reddy : సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు చెందిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. ఇది ఒకింత విస్తు పోయేలా చేసింది. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పలు పదవులు అనుభవించారు. పాలమూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేశారు.
హస్తానికి గుడ్ బై చెప్పారు. ఆ వెంటనే ఆనాటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్. గత కొంత కాలం నుంచీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి(Kuchukulla Damodar Reddy) పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిని కలిశారు. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మాజీ ఎంపీ మల్లు రవి ఇంటికి స్వయంగా వెళ్లారు.
ఆదివారం ఏకంగా బీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చారు కూచుకుళ్ల. నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభత్సవంలో ప్రత్యక్షం అయ్యారు. అందరినీ విస్తు పోయేలా చేశారు. ఆయనను సాదరంగా ఆహ్వానించారు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి.
Also Read : Brian Lara : వెస్టిండీస్ టీమ్ మెంటార్ గా లారా
