Amol Muzumdar : మహిళా జట్టు కోచ్ గా మజుందార్
బీసీసీఐకి అగార్కర్ ప్రతిపాదన
Amol Muzumdar : బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా అజిత్ అగార్కర్ కొలువు తీరాక కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చేతన్ శర్మ స్థానంలో వచ్చిన అగార్కర్ ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు చోటు కల్పించాడు. ప్రస్తుతం భారత జట్టు జూలై 12 నుంచి వెస్టిండీస్ టూర్ లో తన మ్యాచ్ లు ఆడనుంది. టూర్ లో భాగంగా 2 టెస్టులు , 3 వన్డేలు, 5 టి20 మ్యాచ్ లు ఆడుతుంది టీమిండియా.
అజిత్ అగార్కర్ కీలక మార్పులు చేశాడు. సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఇదే సమయంలో ఐపీఎల్ 2023లో దుమ్ము రేపిన యూపీ కుర్రాడు రింకూ సింగ్ ను విస్మరించాడు. దీనిపై ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఈ తరుణంలో చీఫ్ సెలెక్టర్ గా ఉన్న అగార్కర్ మరో కీలక సూచన చేశాడు బీసీసీఐకి.
భారత మహిళా జట్టుకు హెడ్ కోచ్ గా తన స్నేహితుడు అమోల్ మజుందార్(Amol Muzumdar) ను నియమించాలని సిఫారసు చేశాడు. దీంతో బీసీసీఐ అతడిని ఎంపిక చేయడం పూర్తయిందని సమాచారం. ఇద్దరూ రంజీ జట్టుకు గతంలో ముంబై జట్టు తరపున ఆడారు.
ఇక అమోల్ మజుందార్ తన కెరీర్ లో 171 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు. 260 ఇన్నింగ్స్ లలో 11, 167 రన్స్ చేశాడు. మొత్తంగా 30 శతకాలు, 60 అర్ధ సెంచరీలు చేశాడు. డబుల్ సెంచరీ చేసిన రికార్డు అతడి పేరు మీద ఉంది.
Also Read : Farhana Movie : ఉత్కంఠ భరితం ఫర్హానా చిత్రం