Emerging Asia Cup 2023 : ఐసీసీ ఆసియా కప్ షెడ్యూల్
ప్రకటించిన జట్లు శ్రీలంక తప్ప
Emerging Asia Cup 2023 : ఆసియా కప్ 2023కి సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ మేరకు ఒక్క శ్రీలంక జట్టు తప్ప అన్ని జట్లు తమ ఆటగాళ్లను ప్రకటించాయి. తొలి మ్యాచ్ శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతుంది. జూలై 14న భారత్ , పాకిస్తాన్ జట్ల మధ్య సంకుల సమరం ప్రారంభం కానుంది.
ఈనెల13 నుంచి ఆసియా కప్(Asia Cup) స్టార్ట్ అవుతుందని ఐసీసీ వెల్లడించింది. ఆయా జట్లను రెండు గ్రూపులుగా విభజించింది ఐసీసీ. గ్రూప్ – ఏ లో ఆఫ్గనిస్తాన్ , బంగ్లాదేశ్ , ఒమన్ , శ్రీలంక ఉన్నాయి. ఇక గ్రూప్ -బిలో భారత్(India) , పాకిస్తాన్ , నేపాల్ , యూఏఈ జట్లు కేటాయించింది ఐసీసీ. రేపటి నుంచి శ్రీలంకలోని ప్రేమదాస మైదానం ఇందుకు వేదిక కానుంది.
భారత్(India) – ఎ జట్టులో సుదర్శన్ , ప్రదోష్ రంజన్ , అభిషేక్ శర్మ, నికిన్ జోష్ , యశ్ ధుల్ (స్కిప్పర్) , రియాన్ పరాగ్, నిశాంత్ సింధు, ధ్రువ్ జురెల్ , ప్రభ్ సిమ్రాన్ సింగ్ , మానవ్ సుతార్ , యువరాజ్ సిన్జోదడియా, హర్షిత్ రానా సింగ్ , రాజవర్దన్ , నితీశ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇక రిజర్వ్ ఆటగాళ్లుగా హర్స్ దూబే, నేహాల్ , స్నెల్ పటేల్ , రెడ్కర్ ఆడతారు.
ఇక పాకిస్తాన్(Pakistan) -ఎ జట్టుకు హరీష్ కెప్టెన్ కాగా యూసుఫ్, అమద్ బట్ , ఇక్బాల్ , హసీబుల్లా, గులామ్, ముంతాజ్ , ముబాసిర్ ఖాన్ , వసీం జూనియర్ , ఖాసిం, ఫర్హాన్ , సైమ్ అయూబ్ , తయ్యాద్ , ముకీమ్ ఆడతారు.
ఆఫ్గనిస్తాన్ -ఏ జట్టుకు కమల్ కెప్టెన్ , అలీఖిల్ , రమిమి, రియాజ్ హసన్ , జన్నత్ , జద్రాన్ , జుబైద్ అక్బర్ , బహిర్ షా , అష్రఫ్ , నూర్ నసిరి, సలీం అకిమాన్ , సామి ఆడతారు.
బంగ్లాదేశ్ – ఏ జట్టుకు సైఫ్ హసన్ కెప్టెన్ , పర్వేజ్ ఎమాన్ , హసన్ తమీమ్ , షామదాత్ హుస్సేన్ , హన్ జాయ్ , జాకీర్ హసన్ , సౌమ్య సర్కార్ , మెహదీ హసన్ , రకీబుల్ హసన్ , చౌదరి, మొహ్మద్ , నింపున్ చౌదరి, ముస్పిక్ హసన్ , అక్బర్ ఆలీ, నయీమ్ షేక్ ఆడతారు.
నేపాల్ ఏ జట్టుకు పౌడెల్ స్కిప్పర్ కాగా సౌద్ , షస్త్రక్ , కుశాల్ , గుల్సన్ ఝా , కమీ, జిసి , ఖనాల్ , జోరా , మల్లా, రాజ బంపి , షర్కీ, పవన్ సర్రాఫ్ , సూర్య , కిసోర్ మహతో , శ్యామ్ థాకల్ ఆడతారు.
ఒమన్ – ఏ జట్టుకు అకీక్ కెప్టెన్ కాగా జతీందర్ సింగ్ , ప్రజాపతి, ఆయున్ ఖాన్ , సోయబ్ ఖాన్ , సూరజ్ కుమార్ , జె ఒడెద్రా, కలీముల్లా, ఫయాజ్ బట్, శ్రీవాస్తవ, వసీం అలీ, రఫీవుల్లా, పాల్ , బిలాల్ , రవూఫ్ ఆడతారు.
యూఏఈ ఏ జట్టుకు నసీర్ స్కిప్పర్ , ఆదిత్య శెట్టి , ఆర్యన్ శర్మ, టాండన్ , వాల్తాపా, ఏతాన్ , నవాజ్ , గియానాని, జోనాథన్ ఫిగి, లవ్ ప్రీత్ సింగ్ , మతియుల్లా , ఫరాజుద్దీన్ , జవదుల్లా , సంజిత్సా ఆడతారు. ఇదిలా ఉండగా శ్రీలంక ఏ జట్టును ఇంకా ప్రకటించ లేదు.
Also Read : Pawan Kalyan : నానక్ రామ్ గూడలో ఏపీ డేటా