IND vs WI Ist Test : యశస్వి అరుదైన రికార్డ్
తొలి టెస్టులోనే సెంచరీ
IND vs WI Ist Test : విండీస్ టూర్ లో భాగంగా తొలి టెస్టు ఆడుతున్న భారత జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. టీమిండియా తరపున అరంగేట్రం చేసిన యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. తొలి టెస్టులోనే సెంచరీ చేసి ఔరా అనిపించేలా చేశాడు. మొత్తం 244 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్(Yashasvi Jaiswal) 12 ఫోర్లతో 116 రన్స్ చేశాడు. యశస్వికి తోడు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం దుమ్ము రేపాడు. 221 బాల్స్ ఎదుర్కొన్న రోహిత్ 10 ఫోర్లు 2 సిక్సర్లతో 103 రన్స్ చేశాడు.
వికెట్ నష్ట పోకుండా ఓవర్ నైట్ స్కోర్ తో ప్రారంభించిన భారత ఆటగాళ్లు ఎక్కడా తొట్రు పడకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. కరేబియన్ బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయారు. దీంతో తొలి వికెట్ కు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఏకంగా 229 పరుగులు చేశారు. ఆ వెంటనే రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం ఐపీఎల్ స్టార్ శుభ్ మన్ గిల్ మైదానంలోకి వచ్చాడు. కానీ ఎక్కువ సేపు ఉండలేక పోయాడు. చివరకు చేతులెత్తేశాడు. స్లిప్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 245 రన్స్ చేసింది.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు భారత్ తరపున తొలి టెస్టులోనే సెంచరీలు చేసిన వారిలో లాలా అమర్ నాథ్ , విశ్వనాథ్ , అజారుద్దీన్ , గంగూలీ, సెహ్వాగ్ , రైనా, శిఖర్ , రోహిత్, పృథ్వీ షా, అయ్యర్ ఉన్నారు.
Also Read : Modi Govt Praise : వ్యవసాయ రంగంలో తెలంగాణ భేష్