PM Modi NDA : ఎన్డీయేది ఆద‌ర్శ కూట‌మి – మోదీ

స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన మంత్రి

PM Modi NDA : దేశానికి స‌మ‌ర్థ‌వంతంగా సేవ‌లు అందించేందుకు, అంత‌కు మించి బ‌లోపేతం చేసేందుకు ఉద్దేశించిందే ఎన్డీయే ఆద‌ర్శ కూట‌మి అని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. 32 పార్టీల‌తో కూడిన నేష‌న‌ల్ డెమోక్ర‌టిక్ అల‌యెన్స్ (ఎన్డీయే) కీల‌క స‌మావేశం ఢిల్లీలో జ‌రిగింది. ఈ కీల‌క మీటింగ్ కు ప్ర‌ధాన‌మంత్రి నేతృత్వం వ‌హించారు.

PM Modi NDA Slams

కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తిప‌క్షాల‌ను ఏకి పారేశారు ప్ర‌ధాని(PM Modi). వారికి అంత సీన్ లేద‌ని కొట్టి పారేశారు. అవినీతి, అక్ర‌మాల‌కు పెట్టింది పేరంటూ మండిప‌డ్డారు. తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక దేశం అన్ని రంగాల‌లో దూసుకు పోతోంద‌న్నారు న‌రేంద్ర మోదీ. అవినీతి ర‌హిత దేశంగా మార్చాల‌న్నదే త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఇందు కోసం తాను శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్న‌ట్లు చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి.

వ‌చ్చే ఏడాదిలో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లు మ‌న ప‌నితీరుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. అంతా క‌లిసిక‌ట్టుగా ఆద‌ర్శ కూట‌మికి ఎదురే లేద‌ని చాటాల‌ని పిలుపునిచ్చారు న‌రేంద్ర మోదీ. అభిప్రాయ భేదాల‌ను ప‌క్క‌న పెట్టి క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగాల‌ని కోరారు. ప్ర‌జ‌లు సుస్థిర‌మైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన పాల‌న‌ను కోరుకుంటున్నార‌ని అది ఎన్డీయే వ‌ల్ల‌నే సాధ్య‌మ‌వుతుంద‌ని మ‌రోసారి కుండ బ‌ద్ద‌లు కొట్టారు పీఎం.

Also Read : India Poster : ‘ఇండియా’ పోస్ట‌ర్ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!