Rahul Gandhi : ఇండియా ఎన్డీయే మధ్య పోరాటం – రాహుల్
ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్
Rahul Gandhi : ఈ దేశంలో నీతికి అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi). బెంగళూరులో విపక్షాల భేటీ అనంతరం ఆయన పలు అంశాలపై ప్రసంగించారు. గతంలో కంటే ప్రస్తుతం ప్రజాస్వామ్యం మరింత ప్రమాదంలోకి నెట్టి వేయబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ది నమూనా చూద్దామన్నా కనిపించడం లేదన్నారు. ఎప్పుడూ లేనంతగా దేశంలో అవినీతి రాజ్యమేలుతోందని, వ్యాపారులు, కార్పొరేట్ కంపెనీలు హవా చెలాయిస్తున్నాయని ఆరోపించారు రాహుల్ గాంధీ.
Rahul Gandhi Words
వ్యవసాయ రంగం కుంటు పడిందని, కనీస మద్దతు ధర అందడం లేదని , ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించారంటూ ధ్వజమెత్తారు. కేవలం వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడంపై మోదీ ఫోకస్ పెడుతున్నారే తప్పా దేశం గురించి కించిత్ కూడా ఆలోచించడం లేదని ఆవేదన చెందారు.
ఇవాళ విపక్షాల కూటమి ఏకమైన తర్వాత 9 ఏళ్లు పూర్తయ్యాక మోదీకి ఎన్డీయే సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. రాబోయే కాలంలో ఎన్డీయే వర్సెస్ ఇండియాగా మారుతుందన్నారు.
ప్రజల్ని ఎల్లకాలం మోసం చేయాలని అనుకోవడం తప్పన్నారు. ఇకనైనా మోదీ మేల్కోవాలని లేక పోతే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు రాహుల్ గాంధీ.
Also Read : INDIA vs NDA : విపక్షాల కూటమి 26 పార్టీల పేరు ఇండియా