Ponguleti Srinivas Reddy : గాంధీ భవన్ లో పొంగులేటి
ప్రచార కమిటీ వైస్ చైర్మన్
Ponguleti Srinivas Reddy : ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాంధీ భవన్ లో ప్రత్యక్షం అయ్యారు. ఆయన ఇటీవలే జన గర్జన సభ వేదికగా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే ఆయనకు కీలక పదవి అప్పగించింది కాంగ్రెస్ హై కమాండ్.
Ponguleti Srinivas Reddy Ex MP
జిల్లాలో మంచి పట్టు కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy). త్వరలో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీ పరంగా ప్రచార బాధ్యతలను మాజీ నిజామాబాద్ ఎంపీ మధు యాష్కి గౌడ్ ను చైర్మన్ గా నియమించింది. కో చైర్మన్ గా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించింది. ఆయనతో పాటు కత్తి కార్తీక గౌడ్ ను ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి తీసుకుంది. ఆమె యాంకర్ గా సుపరిచితం.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత తొలిసారిగా గాంధీ భవన్ కు వచ్చారు. ఈ సందర్బంగా ఆయనకు సాదర స్వాగతం పలికారు టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి. మాజీ ఎంపీకి శాలువా కప్పారు. అనంతరం మాజీ ఎంపీ మల్లురవి కూడా సన్మానించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డికి శాలువా కప్పడం విశేషం.
Also Read : Rahul Gandhi : ఇండియా ఎన్డీయే మధ్య పోరాటం – రాహుల్