Pawan Kalyan Fan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వైరల్
కమల్ హాసన్ సీన్ రిపీట్
Pawan Kalyan Fan : ఇరు తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు లెక్కలేనంత ఫ్యాన్స్(Pawan Kalyan Fan) ఉన్నారు. ఆయన సినిమాలన్నా, నటన అన్నా , మేనరిజాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఏపీలో క్లీన్ పాలిటిక్స్ ఉండాలనే ఉద్దేశంతో పవర్ స్టార్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు. ఆపై జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.
Pawan Kalyan Fans
మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇందులో భాగంగా వచ్చే శాసన సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. దానికి వారాహి విజయ యాత్ర అని పేరు పెట్టారు. తొలి విడత పూర్తయింది, రెండో విడత నడుస్తోంది. ఇంతలోనే శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త ఛెంప చెల్లుమనిపించింది సీఐ. ఆమె పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్.
తమ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోనంటూ హెచ్చరించారు. యాత్రను నిలిపి వేసి భారీ ర్యాలీతో తిరుపతికి వెళ్లి ఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఢిల్లీకి వెళ్లారు. ఇదిలా ఉండగా తణుకు బహిరంగ సభ సందర్బంగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఓ ఫ్యాన్ ఏకంగా కమల్ హాసన్ సీన్ ను తలపించేలా చేశాడు. క్రేన్ సాయంతో పవన్ కళ్యాణ్ కు పూలదండ వేశాడు. సభ ముగిసినా ఇంకా వైరల్ గా మారింది ఈ ఫోటో.
Also Read : PM Modi : సుస్థిరత..సుపరిపాలన ముఖ్యం – మోదీ