Kanguva Movie : విలక్షణ నటుడు సూర్య నటించిన కంగువ(Kanguva)పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తమిళ సినీ రంగంలో చిత్రం ఇంకా రిలీజ్ కాకుండానే దుమ్ము రేపుతోంది. శివ దర్శకత్వం వహించారు. ఆది నారాయణ కంగువకు కథ రాశారు. మధన్ కార్కీ డైలాగ్స్ రాశారు. సూర్యతో పాటు దిశా పటాని, యోగి బాబు నటించారు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ అందించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రూ. 350 కోట్లకు పైగా కంగువ బడ్జెట్ . ఈ చిత్రానికి సంబంధించి ట్యాగ్ లైన్ కూడా చేర్చారు.
Kanguva Movie Cast
కంగువ – ట్రాన్స్ , మ్యాన్ విత్ ది పవర్ ఆఫ్ ఫైర్స్ అని పెట్టారు. ఎ మైటీ వాలియంట్ సాగా అని కూడా పేరు పెట్టారు. స్టూడియో గ్రీన్ , యువి క్రియేషన్స్ బ్యానర్ లపై కెఇ జ్ఞానవేల్ రాజా , వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు కంగువ చిత్రాన్ని. ఇది భారతీయ తమిళ భాషా కాలపు యాక్షన్ డ్రామా. చిత్రం రూపొందించేందుకు నానా తంటాలు పడ్డారు. చిత్ర నిర్మాణం ఖర్చు పెరగడంతో జ్ఞానవేల్ రాజా తప్పుకున్నాడు.
ఇక దర్శకుడి విషయానికి వస్తే శివ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ తో అన్నాత్తె తీశాడు. ఇక కెరీర్ పరంగా చూస్తే సూర్యకు ఇది 42వ చిత్రం. గోవా, కేరళ, కొడై కెనాల్ లో కంగువా ను చిత్రీకరించారు. కంగువకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మిలియన్స్ కొద్దీ దానిని ఆదరిస్తున్నారు ఫ్యాన్స్. టేకింగ్, మేకింగ్ లో మరింత ఉత్కంఠను రేపుతోంది కంగువ.
Also Read : Kola Guruvulu : విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కోలా