Prabhas Flying : నింగిలో ప్ర‌భాస్ పోస్ట‌ర్ రెప‌రెప‌లు

నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె సెన్సేష‌న్

Prabhas Flying : నాగ్ అశ్విన్ మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు. సి. అశ్వ‌నీద‌త్ నిర్మాణంలో ప్రాజెక్టు-కె చిత్రం రూపుదిద్దుకుంటోంది. పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్ర‌భాస్, బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా ప‌దుకొనే తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్ , శివ రాజ్ కుమార్ న‌టిస్తున్నారు. భారీ ఎత్తున అంచ‌నాలు ఉన్నాయి ఈ చిత్రంపై.

Prabhas Flying Poster

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్ దుమ్ము రేపుతున్నాయి. ప్ర‌త్యేకించి ఇప్ప‌టి వ‌ర‌కు దీపికా ప‌దుకొనేను డిఫ‌రెంట్ స్టైల్ లో చిత్రీక‌రించ‌లేదు. తాజాగా దీపికా క‌ళ్ల‌ను ఫోక‌స్ పెట్టి విడుద‌ల చేసిన పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది.

ఇక నాగ్ అశ్విన్ టేకింగ్, మేకింగ్ లో మోస్ట్ పాపుల‌ర్ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందారు. ప్ర‌స్తుతం ప్రాజెక్టు – కె ను సోషియో, సైన్స్ , ఫాంట‌సీ కథాంశంతో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు నాగ్ అశ్విన్ . ఇప్ప‌టికే విడుద‌ల కాకుండానే ఈ చిత్రం రికార్డులు తిర‌గ రాస్తోంది. ఆకాశంలో ప్రాజెక్టు -కె పోస్ట‌ర్ రెప రెప లాడుతుండ‌డం(Prabhas Flying) వైర‌ల్ గా మారింది.

మ‌రో వైపు ప్ర‌భాస్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన ఆది పురుష్ మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. అయినా డార్లింగ్ ప్ర‌భాస్ హ‌వా ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం రికార్డుల మోత మోగిస్తోంది. యుఎస్ లో అత్య‌ధిక థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

Also Read : Tirumala Hundi : శ్రీ‌వారి ఆదాయం రూ.4.26 కోట్లు

 

Leave A Reply

Your Email Id will not be published!