Arvind Kejriwal : ఢిల్లీలో 1కోటి మొక్కులు నాటుతాం
లక్ష్యంగా పెట్టుకున్నామన్న సీఎం
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. దేశ రాజధాని హస్తినను పూర్తిగా గ్రీన్ సిటీగా మారుస్తామని స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఢిల్లీ అంతటా కాలుష్యం నిండుకునేదని కానీ తాము పవర్ లోకి వచ్చాక ఆ పరిస్థితి మెల మెల్లగా తగ్గుతోందన్నారు అరవింద్ కేజ్రీవాల్. పచ్చదనం పరిశుభ్రత, పర్యావరణం కాపాడుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు.
Arvind Kejriwal Said
ఇందులో భాగంగా ఈ ఏడాది కోటి మొక్కలు నాటుతామని ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). గత మూడు నెలల్లో ఇప్పటి వరకు 27.50 లక్షల మొక్కలు నాటామని చెప్పారు ఢిల్లీ సీఎం. ఇవాళ ఒక్క రోజే 5 లక్షల 50 వేల మొక్కలు నాటడం జరిగిందని ఇది ఢిల్లీ రాష్ట్ర చరిత్రలో ఓ మైలు రాయిగా మిగిలి పోతుందన్నారు అరవింద్ కేజ్రీవాల్.
తమ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, ఉపాధి, పర్యావరణానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తోందని చెప్పారు. మొక్కలు లేక పోతే కాలుష్యం మరింత పెరిగి పోతుందన్నారు. పర్యావరణాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు సీఎం.
త్వరలోనే తాము నిర్దేశించుకున్న మొక్కులు నాటే కోటి లక్ష్యాన్ని చేరుకుంటామన్న నమ్మకం తనకు ఉందన్నారు. మొక్కలు నాటడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు అరవింద్ కేజ్రీవాల్.
Also Read : Gareth Wynn Owen : తిరుమలలో యుకె డిప్యూటీ కమిషనర్