CM Stalin Guarantee : మణిపూర్ అథ్లెట్లకు స్టాలిన్ భరోసా
తమిళనాడుకు ఆహ్వానిస్తున్నాం
CM Stalin Guarantee: ఓ వైపు మణిపూర్ తగలబడుతోంది. హింసోన్మాదంతో రగిలి పోతోంది. దారుణాలకు నెలవుగా మారింది. ఈ తరుణంలో ఖేలో ఇండియా 2024కి ముందు తమిళనాడులో శిక్షణ ఇచ్చేందుకు దేశంలోని అథ్లెట్లను ఆహ్వానించింది తమిళనాడు సర్కార్.
ఈ సందర్భంగా ప్రస్తుతం మణిపూర్ లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనక పోవడంతో అథ్లెట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిని గమనించిన సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆదివారం ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. దేశానికి చెందిన ఏ ఆటగాడు లేదా అథ్లెట్ అయినా సరే ఇక్కడికి వచ్చి శిక్షణ తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
CM Stalin Guarantee & Udayanidhi Stalin
ఇప్పటికే క్రీడా, యువజన శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆహ్వానం పలికారని తెలిపారు. ఈ సందర్బంగా ప్రతి ఒక్కరినీ రావాలని కోరుతున్నానని సీఎం పేర్కొన్నారు. ప్రత్యేకించి మణిపూర్ కు చెందిన అథ్లెట్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచితంగా వసతి, బస ఏర్పాటు చేస్తామని, పూర్తి భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.
సీఎం తీసుకున్న నిర్ణయానికి మణిపూర్ వాసులు జేజేలు పలుకుతున్నారు.
Also Read : Nara Lokesh YS Jagan : స్విమ్మింగ్ పూల్ లో జాగింగ్ చేస్తారా