Manipur Violence Comment : మ‌ణిపూర్ ఫైల్స్ పై మౌన‌మేల

బీజేపీ ఎమ్మెల్యే సూటి ప్ర‌శ్న‌కు జ‌వాబేది

Manipur Violence Comment : భార‌త దేశ చ‌రిత్ర‌లో ర‌క్త చ‌రిత్ర‌కు ద‌ర్ప‌ణంగా నిలిచింది మ‌ణిపూర్. ఆదిమ స‌మాజాన్ని త‌ల‌పింప చేసేలా వైరం, ఆధిప‌త్యం, వివ‌క్ష‌, విద్వేషం , మ‌తం , కులం ప్రాతిప‌దిక‌గా ర‌గులుతోంది. గ‌త కొన్ని నెల‌ల నుంచి నిరాటంకంగా సాగుతోంది. ఒక‌రా ఇద్ద‌రా 150 మందికి పైగా అమాయ‌కులు ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 50 వేల మంది నిరాశ్ర‌యుల‌య్యారు. మ‌ణిపూర్(Manipur) ను వ‌దిలి వెళ్లారు.

హోం మంత్రి అమిత్ షా వెళ్లి వ‌చ్చినా ప‌రిస్థితిలో మార్పు రాలేదు. కానీ అమానవీయ ఘ‌ట‌న‌లు మ‌రింత‌గా పెరిగాయి. స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా మేటి వ‌ర్గం కుకీ వ‌ర్గానికి చెందిన వారిపై దాడుల‌కు దిగింది. ఆపై మ‌హిళ‌ల‌ని చూడ‌కుండా 2 కిలోమీట‌ర్ల మేర న‌గ్నంగా ఊరేగించారు. ఆపై దారుణంగా అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అక్క‌డితో ఆగ‌లేదు. హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది యావ‌త్ భార‌త దేశం. ఏ కొద్ది సంఘ‌ట‌న జ‌రిగినా వెంట‌నే స్పందించడం, ట్వీట్ చేయ‌డంలో ముందంజ‌లో ఉండే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఇంత జ‌రుగుతున్నా మ‌ణిపూర్(Manipur) పై ఒక్క మాట మాట్లాడ‌లేదు.

Manipur Violence Comment Halchal

ఇదే విష‌యాన్ని మ‌ణిపూర్ ప్ర‌జ‌లు నిల‌దీశారు. చివ‌ర‌కు వివ‌స్త్ర‌ల‌ను చేసి ఊరేగించిన వీడియో వైర‌ల్ గా మారింది. సోష‌ల్ మీడియాను షేక్ చేసింది. యావ‌త్ ప్ర‌పంచాన్ని క‌దిలించింది. చివ‌ర‌కు గ‌త్యంత‌రం లేక మోదీ కేవ‌లం రెండే రెండు ప‌దాల‌తో ట్వీట్ తో స‌రి పుచ్చారు. పోనీ ప్ర‌తిప‌క్షాల‌కు సంబంధించిన ప్ర‌భుత్వం అక్క‌డ ఉంద‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే. కేంద్రంలో , మ‌ణిపూర్(Manipur) రాష్ట్రంలో కొలువు తీరింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. 10 వేల మందికి పైగా సైనికులు , బ‌ల‌గాలు మోహ‌రించాయి. కానీ ఇంకా అల్ల‌ర్లు ఆగ‌డం లేదు. చివ‌ర‌కు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటేనే కానీ కేంద్రంలో క‌ద‌లిక రాలేదు. భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ మీకు చేత కాక పోతే మేమే చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారంటే ప‌రిస్థితి ఎంతగా దిగ జారి పోయిందో, ఎంత దారుణంగా ఉందొ అర్థం చేసుకోవ‌చ్చు.

విప‌క్షాల‌పై ప‌దే ప‌దే విరుచుకుప‌డే ప్ర‌ధాని ఎందుకు మౌనంగా ఉన్నారు. ప‌దే ప‌దే గ‌త కొంత కాలంగా అపాయింట్ మెంట్ అడిగితే ఎందుకు ఇవ్వ‌డం లేదంటూ నిల‌దీశారు..సాక్షాత్తు బీజేపీకి చెందిన మ‌ణిపూర్ ఎమ్మెల్యే పౌలియ‌న్ లాల్ హాకిప్ . ఆయ‌న మౌనం వ‌ల్ల‌నే ఇవాళ మ‌ణిపూర్ మండుతోందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఆయ‌న హాట్ టాపిక్ గా మారారు. కార‌ణం మోదీని నిల‌దీయ‌డమే కాదు..ఎమ్మెల్యే అయిన త‌న‌కే ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌న్నారు. సైకోట్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. కాశ్మీర్ ఫైల్స్ కు మ‌ద్ద‌తు ప‌లికిన మోదీ మ‌రి మ‌ణిపూర్ ఫైల్స్ గురించి ఏమంటారో చెప్పాల‌ని బుద్ది జీవులు ప్ర‌శ్నిస్తున్నారు.

Also Read : BJP MLA Paolienlal Haokip : మోదీపై బీజేపీ ఎమ్మెల్యే హౌకిప్ ఫైర్

 

Leave A Reply

Your Email Id will not be published!