Samudra Khani : పవన్ తో పని చేయడం అదృష్టం
బ్రో మూవీ దర్శకుడు సముద్ర ఖని
Samudra Khani : పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వర్క్ పట్ల ఆయనకు ఉన్న డెడికేషన్ ను చూసి నేను విస్మయానికి గురయ్యాను. దర్శకుడు ఏం చెబితే ఆయన చేసుకుంటూ పోతారు. ఇలాంటి నటుడు ప్రతి దర్శకుడికి ఒక అదృష్టంగా భావించక తప్పదన్నారు ప్రముఖ తమిళ సినిమా నటుడు, దర్శకుడు సముద్ర ఖని. ఆయన తీసిన బ్రో ది వారియర్ మూవీ విడుదల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Samudra Khani Said
పవన్ కళ్యాణ్ తో తన అనుభవాన్ని పంచుకున్నారు సముద్ర ఖని(Samudra Khani). పవర్ స్టార్ ను కలిశా. మొత్తం స్క్రిప్టు వినిపించాను. షూటింగ్ ఎప్పటి నుంచి అనుకుంటున్నారని సార్ అడిగారు. మీరు ఓకే అంటే రేపటి నుంచే మొదలు పెడతానని తాను చెప్పానన్నారు డైరెక్టర్. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకున్నారు. అయితే రేపటి నుంచే మొదలు పెడదామని ఓకే చెప్పారు. నేను ఆశ్చర్యానికి లోనయ్యానని అన్నారు సముద్ర ఖని.
కలిసిన మూడు రోజులకే బ్రో చిత్రం షూటింగ్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఆయన సెట్ లో అడుగు పెట్టగానే మొదట గమనిస్తారు. దర్శకుడిగా నేను క్లారిటీ తో ఉన్నానని తనకు అర్థమైందని తెలిపారు. పవన్ కళ్యాణ్ బ్రో సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సమయం వృధా కానీయలేదు. అంతే కాదు ఉపవాసం కూడా ఉన్నారు. నిష్టతో మూవీ చేశామన్నారు సముద్ర ఖని.
Also Read : Gaurav Gogoi : మోదీ మౌనం వీడితే బెటర్ – గొగోయ్