Sanju Samson : బెంచ్ కే పరిమితమైన శాంసన్
సూర్య, ఇషాన్ కు ఛాన్స్
Sanju Samson : మరోసారి కేరళ స్టార్ సంజూ శాంసన్ కు నిరాశే మిగిలింది. విండీస్ టూర్ లో భాగంగా వన్డే జట్టుకు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది సంజూ శాంసన్ ను. చివరి దాకా అతడిని ఎంపిక చేస్తారని భావించారు. కానీ ఉన్నట్టుండి ఫైనల్ టీమ్ ప్రకటన వెలువడగా అందులో శాంసన్ పేరు మారి పోయింది. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ కు వికెట్ కీపర్ స్థానంలో వచ్చాడు. ఎప్పటి లాగే వన్డే ఫార్మాట్ కు ఏ మాత్రం సరి పోని సూర్య కుమార్ యాదవ్ ను తీసుకున్నారు. ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో టీం మేనేజ్ మెంట్ కే తెలియాలి.
Sanju Samson Name Missing
ఇదిలా ఉండగా సూర్య ఆడిన వన్డేలు చూస్తే ఆరు ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇందులో 19, 0, 0, 0 , 14 , 31 రన్స్ చేశాడు. ఇక సంజూ శాంసన్(Sanju Samson) గత 6 ఇన్నింగ్స్ లలో 36, 2 , 30, 86 నాటౌట్ గా ఉన్నాడు. 15, 43 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. సూర్య కుమార్ తో పోల్చినప్పుడు శాంసన్ సగటు కూడా చాలా ఎక్కువగా ఉంది. 11 మ్యాచ్ ల్లో సంజూ శాంసన్ 66 శాతంగా ఉంటే సూర్య 24 మ్యాచ్ లలో 23.78 శాతంగా ఉంది.
ఆస్ట్రేలియా పర్యటన సమయంలో సైతం సంజూ శాంసన్ వన్డేల పరంగా అద్భుతంగా రాణించాడు. కానీ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న సూర్య కుమార్ యాదవ్ ను కంటిన్యూ చేయడం వెనుక ఏమై ఉంటుందనేది తెలియాల్సి ఉంది.
Also Read : Bhagwant Mann : కాంట్రాక్టు టీచర్ల క్రమబద్దీకరణ – సీఎం