Congress Controll Room : కాంగ్రెస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ప్రకటించిన టీపీసీసీ చీఫ్ రేవంత్
Congress Controll Room : తెలంగాణ ప్రదేశ్ కమిటీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు శనివారం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక దానికి ఫ్లడ్ రిలీఫ్ కమిటీని ఏర్పాటు చేయగా మరో కమిటీనీ కంట్రోల్ రూమ్ నిర్వహణకు సంబంధించి నియమించింది.
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితుల సహాయం కోసం ఫ్లడ్ రిలీఫ్ కమిటీకి చైర్మన్ గా కోదండ రెడ్డిని నియమించింది. ఆయనతో పాటు మరో 12 మంది సభ్యులకు బాధ్యతలు అప్పగించింది.
Congress Controll Room For Status
తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయ సహకారాలు అందజేసేందుకు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది టీపీసీసీ. దీనికి చైర్మన్ గా సంగిశెట్టి జగదీశ్వర్ రావును నియమించింది. ఆయనకు సహాయ పడేందుకు గాను మరో 14 మంది సభ్యులను నియమించినట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్(Congress) కమిటీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
గాంధీ భవన్ లోని ఆఫీసులో ఈ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ రూమ్ 24 గంటల పాటు పని చేస్తుందని, వరద బాధితులకు అండగా ఉంటుందని పేర్కొంది.
Also Read : Revanth Reddy : కాంగ్రెస్ ఫ్లడ్ రిలీఫ్ కమిటీ – రేవంత్