Vallab Reddy Case : లహరిని వల్లబ్ రెడ్డి చంపేశాడు
స్పష్టం చేసిన పోలీసులు
Vallab Reddy Case : కాంగ్రెస్ నాయకుడి కుమారుడు వల్లబ్ రెడ్డి దారుణంగా ప్రవర్తించడం వల్లనే లహరి రెడ్డి చని పోయిందని పోలీసులు తేల్చారు. లహరి రెడ్డి హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. లహరి తలను గోడకేసి కొట్టాడు. ఆపై పొట్టపై కాలుతో తన్నడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిందన్నారు. శనివారం పోలీస్ ఉన్నతాధికారి వల్లబ్ రెడ్డి నిర్వాకంపై సంచలన విషయాలు వెల్లడించారు.
Vallab Reddy Case Filing
నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన కాంగ్రెస్ నేత రంగ సాయి రెడ్డి కుమారుడే ఈ వల్లబ్ రెడ్డి(Vallab Reddy). ఆయన వయసు 30 ఏళ్లు. భార్య లహరి వయసు 27 ఏళ్లు. వీరు హిమాయత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా భార్యా భర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి.
వీరి పెళ్లి జరిగి ఏడాది కాగా ఈనెల 13న రాత్రి లహరిని తీవ్రంగా కొట్టాడు వల్లబ్ రెడ్డి. పొట్టలో దారుణంగా తన్నడంతో రెండున్నర లీటర్ల రక్తం బయటకు వచ్చిందన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా హార్ట్ ఎటాక్ పేరుతో ఆస్పత్రిలో చేర్చాడని , అందరినీ నమ్మించాడని వెల్లడించారు.
జూలై 24న లహరి రెడ్డి దశ దిన కర్మకు 10 వేల మందికి భోజనాలు పెట్టాడు. ఏమీ తెలియనట్లు నటించాడు వల్లబ్ రెడ్డి. పోస్టుమార్టంలో వల్లబ్ కొట్టడం వల్లనే చని పోయినట్లు తేలింది. దీంతో సెక్షన్ 302 , 201 కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
Also Read : Congress Controll Room : కాంగ్రెస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
