Sanju Samson : శాంసన్ పై ఎందుకింత కక్ష
వన్డే ఫార్మాట్ కు పనికిరాడా
Sanju Samson : బీసీసీఐ(BCCI) సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా అజిత్ అగార్కర్ మారినా జట్టు పరిస్థితిలో మార్పు రాలేదు. భారత జట్టు త్వరలోనే భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడాల్సి ఉంది. ఇప్పటికే కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది సెలెక్షన్ కమిటీ. వెస్టిండీస్ టూర్ లో భాగంగా వన్డే జట్టును ప్రకటించింది. ఇందులో కేరళ స్టార్ సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇచ్చింది. అంతా జట్టులోకి తీసుకుంటారని భావించారు. కానీ అనూహ్యంగా వన్డే మ్యాచ్ లకు అస్సలు ఎంపిక చేయలేదు.
Sanju Samson Issue
ఇప్పటికే వన్డే కెరీర్ లో పూర్ పర్ ఫార్మెన్స్ కలిగిన ముంబైకి చెందిన సూర్య కుమార్ యాదవ్ ను తీసుకుంది. విచిత్రం ఏమిటంటే హెడ్ కోచ్ ద్రవిడ్ కూడా సూర్య వైపు మొగ్గు చూపడం విశేషం. శాంసన్ గణాంకాలు చూస్తే సూర్య కంటే బెటర్ గా ఉన్నాయి. ఆఖరి 10 మ్యాచ్ లు ఆడితే సంజూ 330 రన్స్ చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 66 శాతానికి పైగా ఉండగా సూర్య యాదవ్ 29 శాతంగా ఉంది.
సంజూ శాంసన్ ను ఎంపిక చేయక పోవడానికి ప్రధాన కారణం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ , కెప్టెన్ రోహిత్ శర్మ, ముంబై లాబీయింగ్ అంటూ మాజీ ఆటగాళ్లు, నెటిజన్లు మండిపడుతున్నారు.
Also Read : Satyavathi Rathod : బాధితులకు సత్యవతి భరోసా