SS Raja Mouli Vijay : జోసెఫ్ విజ‌య్ పై రాజ‌మౌళి కామెంట్

సోష‌ల్ మీడియాలో ట్వీట్ హ‌ల్ చ‌ల్

SS Raja Mouli Vijay : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ఏది చేసినా అది సంచ‌ల‌న‌మే. ఆయ‌న సామాజిక మాధ్య‌మాల‌లో బిజీగా ఉంటారు. సినిమాల‌కు సంబంధించి ఎంతగా ఫోక‌స్ చేసినా ఒకింత క‌న్నేసి ఉంచుతారు ట్విట్ట‌ర్ పై. ఏదో ఒక అంశంపై ట్వీట్ చేయ‌కుండా ఉండ‌లేరు . తాజాగా త‌మిళ సినిమా రంగానికి చెందిన టాప్ లో కొన‌సాగుతున్న నటుడు త‌ల‌ప‌తి విజ‌య్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

SS Raja Mouli Vijay Comments

ఈ మేర‌కు త‌ను న‌టించిన కురువిని ఈ సంద‌ర్బంగా ప్ర‌స్తావించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త‌మిళ సినీ రంగంలో చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది.

ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ తాను డార్లింగ్ ప్ర‌భాస్ తో తీసిన ఛ‌త్ర‌ప‌తి సినిమాలోని స‌న్నివేశంతో పోలి ఉందంటూ పేర్కొన‌డ‌మే. ప్ర‌స్తుతం ఇది మ‌రింత రాద్ధాంతానికి దారి తీసేలా ఉంది. సామాన్యంగా వివాదాల జోలికి వెళ్ల‌రు ఎస్ఎస్ రాజ‌మౌళి(SS Raja Mouli). తాను ఏది క‌రెక్ట్ అని అనుకుంటే దానిని న‌మ్మి తీస్తారు. మ‌రో వైపు జోసెఫ్ విజ‌య్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎందుకంటే ద‌క్షిణాది సినీ రంగంలో త‌ల‌ప‌తి మోస్ట్ పాపుల‌ర్ యాక్ట‌ర్.

అత్య‌ధిక పారితోష‌కం తీసుకునే న‌టుడిగా గుర్తింపు పొందారు. ఆయ‌న తాజాగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో లియోలో న‌టించాడు. అది దాదాపు పూర్తి కావ‌చ్చింది. మ‌రో సినిమాకు సంత‌కం చేశాడు. అది కూడా త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. మినిమం గ్యారెంటీ ఉన్న న‌టుడు విజ‌య్ పై ట్వీట్ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Also Read : G Kishan Reddy : ఎస్డీఆర్ఎఫ్ అకౌంట్లో రూ. 900 కోట్లు

 

Leave A Reply

Your Email Id will not be published!