Raghav Chadha : ఆప్ సర్కార్ అస్థిరతకు కుట్ర – చద్దా
కేంద్ర సర్కార్ పై ఎంపీ షాకింగ్ కామెంట్స్
Raghav Chadha : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కావాలని బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. గత 25 ఏళ్లలో ఢిల్లీలో రాజకీయాలు కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఆ తర్వాత బీజేపీ తను పవర్ లోకి రావాలని అనుకుంది. కానీ దేశ రాజధాని వాసులు పూర్తిగా కాషాయ పార్టీని తిరస్కరించారు.
Raghav Chadha Comments
ఢిల్లీ ప్రజలు మూకుమ్మడిగా ఆప్ ను అక్కున చేర్చుకున్నారని, ఇటీవల జరిగిన ఢిల్లీ నగర పాలక సంస్థల ఎన్నికల్లోను తమకే పట్టం కట్టారని అన్నారు రాఘవ్ చద్దా(Raghav Chadha). పాలనా పరంగా సమర్థవంతంగా పని చేయడం వల్లనే అధికారంలోకి వచ్చామని స్పష్టం చేశారు.
దీనిని జీర్ణించు కోలేని మోదీ ప్రభుత్వం కావాలని ప్రభుత్వాన్ని అస్థిరత పర్చేందుకు కుట్ర పన్నుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని , సర్వోన్నత ధర్మాసనం కూడా కీలక వ్యాఖ్యలు చేసిందన్నారు. పాలనా పరంగా పవర్స్ అన్నీ ఒక్క లా అండ్ ఆర్డర్ తప్ప అన్నీ ఆప్ ప్రభుత్వానికే చెందుతాయని తేల్చిందన్నారు. గత 1998 నుండి నేటి దాకా ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఒప్పుకోలేదన్నారు రాఘవ్ చద్దా.
Also Read : SS Raja Mouli Vijay : జోసెఫ్ విజయ్ పై రాజమౌళి కామెంట్