Shaheed Udham Singh : దేశం మ‌రువ‌ని ధీరుడు ఉధ‌మ్ సింగ్

అంగ్లేయుల‌కు చుక్క‌లు చూపిన యోధుడు

Shaheed Udham Singh : దేశం మ‌రువ‌ని ధీరుడు ష‌హీద్ ఉధ‌మ్ సింగ్. డిసెంబ‌ర్ 26, 1899లో పుట్టాడు. జూలై 31న 1940లో ఉరి తీయ‌బ‌డ్డాడు. ఆంగ్లేయుల‌కు వ్య‌తిరేకంగా పోరాడాడు. ఆయ‌న అస‌లు పేరు రామ్ మొహ‌మ్మ‌ద్ సింగ్ ఆజాద్  ఉధ‌మ్ సింగ్. విప్ల‌వ‌కారుడిగా ఉన్నాడు. ఇండియ‌న్ వ‌ర్క‌ర్స్ అసోసియేష‌న్ , హిందూస్తాన్ సోష‌లిస్ట్ రిప‌బ్లిక‌న్ అసోసియేష‌న్ , గ‌ద‌ర్ పార్టీలో కీల‌కంగా ప‌ని చేశాడు. ఆనాటి జ‌లియ‌న్ వాలా బాగ్ మార‌ణ‌కాండ‌కు ప్ర‌తీకారంగా మైఖేల్ ను హ‌త మార్చినందుకు ప్ర‌సిద్ది చెందాడు ఉధ‌మ్ సింగ్. హ‌త్య చేసినందుకు ఉరి తీయాల‌ని ఆనాటి ఆంగ్లేయ ప్ర‌భుత్వం ఆదేశించింది.

Shaheed Udham Singh Warrior

భార‌త దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. ఆయ‌న‌ను ష‌హీద్ ఇ ఆజం స‌ర్దార్ ఉధ‌మ్ సింగ్(Shaheed Udham Singh) అని పిలుస్తారు. ఆయ‌న స్మృత్య‌ర్థం ఉత్త‌రాఖాండ్ లోని ఒక జిల్లాకు ఉధ‌మ్ సింగ్ న‌గ‌ర్ అని పేరు పెట్టారు. సింగ్ విప్ల‌వ రాజ‌కీయాల‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. భ‌గ‌త్ సింగ్ బృందంతో ప్ర‌భావితం అయ్యాడు. గ‌ద‌ర్ పార్టీతో పాలు పంచుకున్నాడు. వ‌ల‌స రాజ్యాన్ని కూల దోసేందుకు భార‌తీయుల‌ను సంఘ‌టితం చేశాడు ఉధ‌మ్ సింగ్.

తన‌ను ఉరి తీస్తున్న స‌మ‌యంలో ఉధ‌మ్ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు నేటికి స్పూర్తి దాయ‌కంగా నిలిచాయి. నాకు చావు అంటే భ‌యం లేదు. నేను నా దేశం కోసం చ‌ని పోతున్నాన‌ని ప్ర‌క‌టించాడు ఉధ‌మ్ సింగ్. బ్రిటిష్ పాల‌న‌లో నా ప్ర‌జ‌లు ఆక‌లితో అల‌మ‌టించ‌డం చూశాను. అందుకే చంపాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని ప్ర‌క‌టించాడు.

Also Read : Raghav Chadha : ఆప్ స‌ర్కార్ అస్థిర‌తకు కుట్ర – చ‌ద్దా

 

Leave A Reply

Your Email Id will not be published!