Tirumala Rush : తిరుమలకు పోటెత్తిన 85 వేల భక్తులు
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లు
Tirumala Rush : పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. భారీ ఎత్తున తరలి వచ్చారు. ఎక్కడ చూసినా గోవింద నామ స్మరణతో నిండి పోయింది. ఓ వైపు భారీగా వర్షాలు కురుస్తున్నా మరో వైపు భక్తుల తాకిడి మాత్రం తగ్గలేదు. గత 65 రోజులుగా భక్తులు ప్రతి రోజూ 75 వేలకు పైగానే శ్రీవారిని దర్శించుకున్నారు. కానీ ఆదివారం సెలవు రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్త బాంధవులు తరలి వచ్చారు.
Tirumala Rush Huge
శ్రీనివాసుడిని, శ్రీ అలివేలు మంగమ్మ అమ్మ వారిని 85 వేల 258 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 451 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. భక్తులు నిత్యం శ్రీ వేంకటేశ్వర స్వామికి సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం గణనీయంగా పెరగడం విశేషం. రూ. 4 కోట్ల 28 లక్షలు ఆదాయం వచ్చిందని తెలిపింది.
స్వామి వారి దర్శనానికి కనీసం 12 గంటల సమయం పడుతుందని టీటీడీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది టిటీడీ. దగ్గరుండి పర్యవేక్షించారు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి.
Also Read : Shaheed Udham Singh : దేశం మరువని ధీరుడు ఉధమ్ సింగ్
