G Kishan Reddy : ఎస్సీ, ఎస్టీ నిధుల దుర్వినియోగం
ఆరోపణలు చేసిన జి. కిషన్ రెడ్డి
G Kishan Reddy : తెలంగాణ బీజేపీ చీఫ్ , కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి దూకుడు పెంచారు. ఆయన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఇతర సంక్షేమ పథకాలకు వాడుకుంటోందంటూ ఆరోపించారు. కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఉద్దేశించిన నిధుల నుంచి రూ. 11 వేల కోట్లను మళ్లించిందని కీలక వ్యాఖ్యలు చేశారు.
G Kishan Reddy Comments
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారు ఇలాంటి హామీలే ఇస్తారంటూ ధ్వజమెత్తారు. దలిత, గిరిజన వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు జి. కిషన్ రెడ్డి(G Kishan Reddy).
రాష్ట్రంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి మేలు చేకూర్చేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పైకి ఒకరిపై మరొకరు తిట్టుకుంటున్నా లోపల కాంగ్రెస్ , బీఆర్ఎస్ ఒక్కటేనని ధ్వజమెత్తారు బీజేపీ చీఫ్.
ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరన్నారు. సుస్థిరత, సమర్థవంతమైన నాయకత్వం కలిగిన పార్టీని, నాయకుడిని, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ లక్షణాలు కేవలం బీజేపీతో మాత్రమే సాధ్యమవుతాయని స్పష్టం చేశారు.
Also Read : Minister KTR : సవాల్ గా మారిన పార్కింగ్ సమస్య