TSRTC Bandh : రాష్ట్రమంతటా బస్సులు బంద్
ఆమోదించని గవర్నర్ పై గుస్సా
TSRTC Bandh : ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించక పోవడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. శనివారం గవర్నర్ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు ఆర్టీసీ ఉద్యోగులు. ఇవాళ తెల్లవారుజాము నుంచే బస్సులను స్వచ్చంధంగా నిలిపి వేశారు(TSRTC Bandh). వేలాది బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. గవర్నర్ కావాలని ఆర్టీసీ బిల్లును అడ్డుకుంటోందని ఉద్యోగులు ఆరోపించారు.
TSRTC Bandh Declaration
ఇది పూర్తిగా కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. ఇది పక్కన పెడితే ప్రభుత్వం గతంలో ఆర్టీసి పట్ల, ఉద్యోగుల పట్ల నిర్దయగా వ్యవహరించింది. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పలువురు కార్మికులు బలిదానం చేసుకున్నారు. మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పక్క రాష్ట్రం ఏపీలో అక్కడి వైసీపీ జగన్ రెడ్డి సర్కార్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారు. అందులో పని చేస్తున్న వారినందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడి ఆర్టీసీ సమర్థవంతంగా పని చేస్తోంది. ఇక తెలంగాణలోని ఆర్టీసికి సంబంధించి ఆస్తుల విలువ దాదాపు లక్ష కోట్లకు ఉందని దానిపై సర్కార్ కన్నేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ బిల్లుపై తనకు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నట్లు సమాచారం.
Also Read : Supreme Court Rahul Comment : సుప్రీం తీర్పు శిరోధార్యం