Imran khan Arrest Comment : బోనులో చిక్కిన ‘సింహం’

అరెస్ట్ ఊహించిందేన‌న్న ఇమ్రాన్

Imran khan Arrest Comment : అత‌డిని అరెస్ట్ చేసినందుకు ప్ర‌స్తుత పాకిస్తాన్ పాల‌క వ‌ర్గం సంతోష ప‌డి ఉండ‌వ‌చ్చు. లేదా త‌న‌ను వ్య‌తిరేకించే వ‌ర్గాలు, పారా మిల‌ట‌రీ లోని కొంద‌రు సంబురాల‌లో మునిగి పోవ‌చ్చు గాక‌. కానీ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఈ పేరు చెబితే కోట్లాది మంది త‌మ కంటే ఎక్కువ‌గా అభిమానిస్తారు. ఆరాధిస్తారు. చివ‌ర‌కు ప్రేమిస్తారు కూడా. మొద‌టి నుంచీ ధిక్కార మ‌న‌స్త‌త్వ‌మే అత‌డిది. ఒక ర‌కంగా మొండి ఘ‌టం అని కూడా తెలిసిన వాళ్లు పిలుచుకుంటారు.

దాయాది దేశంలో ప్రెసిడెంట్ ,పీఎం కేవ‌లం నామ మాత్ర‌మే. అంతా ఆర్మీ క‌నుస‌న్న‌ల‌లో న‌డ‌వాల్సిందే. కానీ ఇమ్రాన్ ఖాన్ నియాజీ అలాంటోడు కాదు. ఎందుకంటే అత‌డిది ప్ర‌శ్నించే త‌త్వం. అంత‌కు మించి ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డమంటే ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇవ్వ‌డం వ‌ల్ల కావ‌చ్చు. మ‌నోడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పాకిస్తాన్ లో జ‌నం తిండి లేక పోయినా ఇమ్రాన్ ఖాన్ ను మాత్రం ఇప్ప‌టికీ హీరోగానే చూస్తారు. కారణం లేక పోలేదు. ఆ దేశానికి తొలిసారిగా క్రికెట్ కెప్టెన్ గా వ‌ర‌ల్డ్ క‌ప్ ను తీసుకు వ‌చ్చాడు. ఎప్ప‌టికీ, ఎవ‌రికీ త‌ల‌వంచ‌ని త‌త్వ‌మే అత‌డిని నాయ‌కుడిగా మార్చేలా చేసింది.

Imran khan Arrest Comment Viral

కానీ ఎంత వార‌లైనా కాంత దాసులే అన్న‌ట్లు చాలా మందితో అఫైర్స్ ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ముగ్గురితో పెళ్లిళ్లు జ‌రిగాయి. ఆట నుంచి రాజ‌కీయ చ‌ద‌రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. పీటీఐ పేరుతో పార్టీని స్థాపించాడు. చివ‌ర‌కు ప్ర‌ధాన‌మంత్రిగా ఎన్నిక‌య్యాడు. ఇదే స‌మ‌యంలో ప్ర‌పంచాన్ని చుట్టి వ‌చ్చాడు. ఎక్క‌డికి వెళ్లినా ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ను క్రికెట‌ర్ గానే చూశారు త‌ప్ప ఒక రాజ‌కీయ నాయ‌కుడిగా చూడ‌లేదు దాయాది దేశ ప్ర‌జ‌లు. ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో ఎన్నో చేయాల‌ని అనుకున్నాడు. కానీ ఏమీ చేయ‌లేక పోయాడు. చివ‌ర‌కు అప‌వాదును మూట గ‌ట్టుకున్నాడు. అంద‌రి లాగే భార‌త్ తో క‌య్యానికి కాలు దువ్వాడు. చివ‌ర‌కు ప్ర‌పంచ వేదిక‌ల‌పైకి ఎక్క‌డికి వెళ్లినా విమ‌ర్శ‌లు గుప్పించాడు. చివ‌ర‌కు అనూహ్యంగా పాకిస్తాన్ చ‌రిత్ర‌లో తొలి ప్ర‌ధానిగా అవిశ్వాస తీర్మానంతో రాజీనామా చేసి ఇంటి బాట ప‌ట్టాడు.

అత‌డిపై ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. ఇవ‌న్నీ త‌న‌ను కావాల‌ని ఇరికించేందుకు కుట్ర ప‌న్నారంటూ ఆరోపించాడు. అంతే కాదు తాను దిగి పోయేందుకు అమెరికా కుట్ర ప‌న్నిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. కానీ ఇమ్రాన్ నియాజీ మాట‌ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌లేదు.. ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. చివ‌ర‌కు విదేశీ ప్ర‌ముఖులు ఇచ్చిన బ‌హుమ‌తుల‌ను ప్ర‌తి ఒక్క‌టినీ వివ‌రాల‌ను న‌మోదు చేయాల్సి ఉంటుంది. కానీ వాటిని అమ్మేశాడంటూ ఆయ‌న‌పై కేసు న‌మోదైంది. చివ‌ర‌కు అదే కొంప ముంచేలా చేసింది.

పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇమ్రాన్ ఖాన్ ను దోషిగా తేల్చింది. 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతే రాజ‌కీయాల నుంచి 5 ఏళ్ల పాటు దూరంగా ఉండాల‌ని ఆదేశించింది. ఈ సంద‌ర్భంగా త‌న‌ను అరెస్ట్ చేశారు. ఆయ‌న పార్టీ నేత‌లు మాత్రం ఇమ్రాన్ ఖాన్ ను చంపుతారంటూ ఆరోపిస్తున్నారు. ఆవేద‌న చెందుతున్నారు. ఏది ఏమైనా వ్య‌క్తిగ‌తంగా ఎన్ని బ‌ల‌హీన‌త‌లు ఉన్న‌ప్ప‌టికీ ఇమ్రాన్ ఖాన్ ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ హీరో..అంతే కాదు ఓట‌మిని ఒప్పుకోని లీడ‌ర్..కెప్టెన్ కూడా. అందుకే సింహం ఇప్పుడు జైలుకు వెళ్లి ఉండ‌వ‌చ్చు..కానీ రేపు ఎప్పుడైనా రావ‌చ్చు. చెప్ప‌లేం రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చు.

Also Read : Ayutha Chandi Athirudram : 14 నుండి అయుత చండీ అతిరుద్రం

Leave A Reply

Your Email Id will not be published!