Rohit Sharma Launch : యుఎస్ లో రోహిత్ క్రికెట్ అకాడమీ
క్రిక్ కింగ్ డమ్ ను ప్రారంభించిన కెప్టెన్
Rohit Sharma Launch : అమెరికాలో ప్రస్తుతం క్రికెట్ కు జనాదరణ లభిస్తోంది. ఇక్కడ ఇప్పటికే క్రికెట్ లీగ్ లను ప్రోత్సహిస్తోంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సల్ (ఐసీసీ). వరల్డ్ కప్ ను అమెరికా, విండీస్ లో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) ఈ ఏడాది సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసింది.
Rohit Sharma Launch Cricket Academy
ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు జట్లలో భారీగా ఇన్వెస్ట్ చేయడంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఎంఐ న్యూయార్క్ తొలి మేజర్ లీగ్ క్రికెట్ ఛాంపియన్ గా నిలిచింది. స్థానికంగా ఉన్న వారిని క్రికెటర్లుగా తయారు చేసేందుకు ఇది దోహద పడుతుందని భావిస్తోంది ఐసీసీ.
తాజాగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అమెరికా లోని కాలిఫోర్నియాలో క్రిక్ కింగ్ డమ్ క్రికెట్ అకాడమీని స్థాపించడం విశేషం. రోహిత్(Rohit Sharma) క్రికెట్ అకాడమీ వెంచర్ కీలకమైన ప్రభావాన్ని చూపనుంది. యుఎస్ లో మేజర్ క్రికెట్ ను పరిచయం చేయడం, ఔత్సాహిక క్రికెటర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు , అంతర్జాతీయ తారల నుండి నేర్చుకునేందుకు తలుపులు తెరిచేలా చేసింది.
ఎంఎల్సీ ఛాంపియన్ గా ఎంఐ అవతరించడం విశేషం. ఫైనల్ లో 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక నికోలస్ పూరన్ 55 బంతులు ఆడి 137 రన్స్ చేశాడు. నాటౌట్ గా నిలిచాడు. మొత్తంగా క్రికెట్ కు ఫుల్ సపోర్ట్ దొరుకుతోంది అమెరికాలో.
Also Read : RTC Driver Busi Babu : ఆర్టీసీ బిల్లు కోసం ఆగిన ‘గుండె’